చెక్క పాత్రలపై మరకలు పోవాలంటే..?


Thu,October 11, 2018 07:23 PM

ప్రస్తుతం స్టీల్‌కు బదులుగా అందరూ చెక్క పాత్రలకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అయితే వంట తర్వాత చెక్క పాత్రలు దుర్వాసన వెదజల్లుతున్నాయి. మరకలతో కొన్ని అసహ్యంగా కనబడుతుంటాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ఈ చిట్కాలు ప్రయత్నించండి.
* వేడి నీటిలో నిమ్మరసాన్ని కలుపాలి. ఈ మిశ్రమంలో చెక్క పాత్రలను 15 నిమిషాల పాటు డిప్ చేయాలి. తరువాత వేడి నీటితో శుభ్రపరిచిన బట్టతో శుభ్రంగా తుడువాలి. ఎండలో కాసేపు ఆరబెట్టాలి. దీంతో త్వరగా మరకలు తొలిగిపోతాయి.
* ఉప్పు నీటిలో శుభ్రం చేయాల్సిన చెక్క పాత్రలను వేసి 5 నిమిషాలు పాటు మరిగించాలి. చెక్క పాత్రలను బట్టతో తుడువాలి. ఆ తరువాత పాత్రలను రోజంతా ఎండనివ్వాలి.
* వంటగదిలో ఉపయోగించే చెక్క పాత్రలు వాడిన తరువాత ఎప్పటికప్పుడు వేడినీళ్లతో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల పాత్రలు క్లీన్‌గా ఉంటాయి.
* బేకింగ్ సోడా, నిమ్మరసం బాగా కలుపాలి. ఈ పేస్ట్‌ను ఉడెన్ పాత్రలకు ఐప్లె చేయాలి. 15 నిమిషాల తరువాత వేడి నీటితో, తర్వాత చల్లని నీటితో పాత్రలను శుభ్రం చేసుకోవాలి.
* వెనిగర్, తేనె వేసి బాగా మిక్స్ చేయాలి. దూది తీసుకొని ఈ మిశ్రమంలో డిప్ చేయాలి. ఆ దూదితో వంటకు ఉపయోగించే పాత్రలను తుడువాలి. ఇలా తరుచూ చేస్తూ ఉంటే పాత్రలకు అంటిన మరకలు తొలిగిపోతాయి.

2858
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles