ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - Jun 15, 2020 , 17:45:54

ఈ లక్షణాలుంటే.. విటమిన్‌ డీ లోపం ఉన్నట్లే..

ఈ లక్షణాలుంటే.. విటమిన్‌ డీ లోపం ఉన్నట్లే..

కరోనా వైరస్‌ ప్రతి ఒక్కరి జీవితాన్ని అతలాకుతలం చేస్తోంది. దీనికి మందును కనిపెట్టేందు అన్ని దేశాలు శ్రమిస్తున్నాయి. కరోనా బారి నుంచి మనల్ని మనం కాపాడుకునేందుకు శరీరంలో ‘విటమిన్‌ డీ’ తగ్గకుండా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. విటమిన్‌ డీ ఎముకలు, కండరాళ్లు బలంగా ఉండేందుకు సహాయపడుతోంది. ఈ విటమిన్‌ సూర్యరశ్మి నుంచి మనకు లభిస్తోంది. అయినా విటవిన్‌ డీ లోపంతో బాధనపడుతున్నావారు చాలా మంది ఉన్నారు. మనలో విటమిన్‌ డీ లోపాన్ని కొన్ని లక్షణాల ద్వారా తెలుసుకోవచ్చు. అవేంటో చూద్దాం.  • ప్రత్యేకమైన కారణం లేకుండా మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారంటే అది విటమిన్‌ డీ లోపమే.
  • విటవిన్‌ డీ మన శరీరానికి నైట్రిక్‌ ఆక్సైడ్‌ను అందిస్తుంది. నైట్రిక్‌ ఆక్సైడ్‌ మనకు అవసరమైన ఆహారాన్ని మత్రమే తినేలా చేస్తుంది. కాబట్టి బరువు పెరగడం కూడా విటమిన్‌ డీ లోపమే.
  • జుట్టు ఎక్కువగా రాలడం వంటి సమస్యలకు చాలా వరకు విటమిన్‌ డీ లోపమే కారణం.
  • డిప్రేషన్‌లో ఉన్నవారిలో సూర్యరశ్మి ఉత్తేజాన్ని నింపుతోంది.
  • మనకు ఏదైనా గాయమై తొందరగా తగ్గకుంటే అది విటమిన్‌ డీ లోపమే అని తెసుకోవచ్చు.
  • ఎముకల బలహీనతకు విటమిన్‌ డీ లోపమే కారణం. ఈ సమస్య ఎక్కువగా పెద్ద వయస్కుల్లో వస్తుంది. 
  • రాత్రిపూట సరిగ్గా నిద్ర పట్టడంలేదంటే మీరు ఎక్కువగా సూర్యకాంతిలో ఉండకుండా ఉంట్లోనే గడుపుతున్నారని అర్ధం. 
  • విటమి‌న్‌ డీ ని పొందాలంటే ప్రతి రోజు ఉదయం, సాయంత్రం కొద్దిసేపు బయట గడపాలి.
  • సూర్యాకాంతితో విటమిన్‌ డీ ఉచితంగా లభిస్తోంది. లేదా ఆకుకూరలు, చేపలతో కూడా విటమిన్‌ డీ ను పొందవచ్చు.


logo