బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - May 05, 2020 , 13:08:18

మట్టికుండలో చల్లబడే నీటిలో ఎలాంటి రసాయనాలూ ఉండవు

మట్టికుండలో చల్లబడే నీటిలో ఎలాంటి రసాయనాలూ ఉండవు

వేసవిలో భగభగ మండే భానుడి తాపానికి ప్రజలు దాహంతో అల్లాడుతున్నారు.  ఇప్పుడు దాహం తీర్చుకోవడంతో పాటు ఆరోగ్య పరిరక్షణ కోసం కుండ నీళ్లే తాగడం మంచిదని  వైద్య నిపుణులు చెబుతున్నారు.  ఫ్రిజ్‌లోని కూల్‌ వాటర్‌  తాగడం ద్వారా దాహం తీరకపోగా కొంతమందికి జలుబు, గొంతు నొప్పి వంటి సమస్యలు వస్తున్నాయి.   దీంతో  చాలా మంది  కుండ నీటికే ప్రాధాన్యం ఇస్తున్నారు.

-కుండలో నీరు సహజంగా చల్లబడుతుంది. వేసవిలో దప్పిక తీర్చుకోవడానికి, ఎండ తాపం నుంచి ఉపశమనం పొందడానికి ఈ సహజమైన చల్లని నీరు తాగడమే ఉత్తమం.

-కుండ నీటిలో ఉండే సహజ మినలర్స్ శరీరానికి అదనపు శక్తిని ఇచ్చి ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పోకుండా చేస్తాయి.

-సహజంగా చల్లబడే ఈ నీటికి ఇమ్యూనిటీ గుణాలు అధికంగా ఉంటాయి.

-ఈ నీరును తాగడం వల్ల సహజంగా శరీరానికి ఆల్కలైన్ అందుతుంది. అనారోగ్యాలు దరి చేరకుండా చేస్తుంది.

-ప్లాస్టిక్ బాటిల్స్‌లో నిల్వ ఉంచిన నీటిని తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు చుట్టుముడుతాయి.

-మట్టికుండలో చల్లబడే నీటిలో ఎలాంటి రసాయనాలూ ఉండవు. శరీరానికి ఎలాంటి హానీ జరుగదు.

-మట్టి కుండలో నిల్వ ఉంచిన నీరు తాగడం వల్ల మెటబాలిజం రేటు పెరుగుతుంది.

-ఈ సహజమైన నీటితో వడదెబ్బ నుంచి ఉపశమనం లభిస్తుంది.

-ఈ నీటితో ముఖం కడుక్కుంటే చర్మం మృదువుగా మారుతుంది.


logo