సోమవారం 18 జనవరి 2021
Health - Nov 23, 2020 , 22:18:47

డయాబెటీస్ లక్షణాలు ఇవే..

డయాబెటీస్ లక్షణాలు ఇవే..

హైదరాబాద్‌ :  ఇప్పుడు చాలా మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. 1980 నుంచి 2014 వరకూ ప్రపంచవ్యాప్తంగా సుమారు 108 మిలియన్ల నుంచి 422 మిలియన్ల మంది డయాబెటిస్‌తో ఇబ్బంది పడుతున్నట్లు  ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. ఆదిలోనే దీన్ని  గుర్తించి జాగ్రత్తలు పాటించకపోతే ప్రాణానికే ముప్పు తెస్తుంది. డయాబెటిస్ వచ్చిందటే అది తినకూడదు.. ఇది తినకూడదు అంటూ జీవితాంతం.. డైట్, ట్రీట్మెంట్, రెగ్యులర్ స్క్రీనింగ్స్‌తోనే గడిపేయాలి. వీటికి తోడు నీరసం భరించాలి. ఇంత ప్రమాదకరమైన డయాబెటిస్‌ను ముందే పసిగట్టి.. తగిన జాగ్రత్తలు తీసుకోవడం మేలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 

ఇవి ఉంటే జాగ్రత్త..

1. అనుకోకుండా బరువు తగ్గడం : ఎలాంటి డైట్ చేయకుండా.. రోజువారీ  శ్రమ కన్నా ఎక్కువ కష్టపడకుండా 5శాతం కంటే ఎక్కువ బరువు తగ్గామంటే ఆరోగ్యం దెబ్బతిందని అర్థం. ఇది డిప్రెషన్, మాల్‌ న్యూట్రీషియన్, సిలియాక్ సమస్యలకు కారణమవొచ్చు. కాబట్టి వెంటనే డాక్టర్‌ను సంప్రదించడం మంచిది.

2. కంటి చూపు మందగించడం : కంటిచూపు మందగించడం డయాబెటిస్ ముఖ్య లక్షణం. అజాగ్రత్తగా ఉంటే ముందుముందు కంటిచూపును పూర్తిగా పోయే అవకాశముంది. ఎందుకంటే.. డయాబెటిస్ కంటి రెటీనాను దెబ్బతీస్తుంది.

3. బాగా దాహం వేయడం : బ్లడ్ షుగర్ పెరుగుతున్నప్పుడు తరచూ దాహం వేస్తుంది. 

4. హై బీపీ : ముగ్గురు డయెబెటీస్ పేషంట్లలో ఇద్దిరికి కచ్చితంగా హై బీపీ ఉంటుంది. బీపీ 140/90 దాటిందంటే కచ్చితంగా వైద్య పరీక్షలు చేయించుకోవాలి. 

5. కాళ్లలో తిమ్మిర్లు, నొప్పి : డయాబెటిక్ న్యూరోపతికి కాళ్లలో తిమ్మిర్లు, నొప్పులు సిగ్నల్ లాంటివి. షుగర్ లెవల్ పెరగడంతో  నరాలు దెబ్బతిని ఇలా జరుగుతుంది.

6. విపరీతమైన ఆకలి  : ఇది డయాబెటీస్ మొదటి లక్షణం. తరచూ బాగా ఆకలేస్తుంటే డాక్టరును సంప్రదించి కారణమేంటో తెలుసుకోవాలి.

7. ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ : డయాబెటీస్ పేషంట్లకు బీపీ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఈస్ట్ ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి.  జననేంద్రియాల చుట్టూ పుండ్లు పడటం, సెక్స్ సమయంలో నొప్పి       

     రావడం జరుగుతుంది.

8. గాయం త్వరగా మానకపోవడం  : శరీరంలో కొత్త రక్తనాళాలు రాకుండా డయాబెటిస్ అడ్డుకుంటుంది. అందుకే డయాబెటీస్ పేషెంట్లకు దెబ్బలు, గాట్లు అంత త్వరగా మానవు.  

 9. వికారం, వాంతులు

10. అలసిపోయినట్టు అనిపిస్తుంది.

11. ఎరెక్షన్(పురుషుల్లో అంగస్థంభన)

12. ఎక్కువ సార్లు మూత్రరావడం

13. చర్మంపై నల్లటి మచ్చలు

14. ఫల-వాసనతో కూడిన శ్వాస 

15. శ్వాస వేగం పెరగడం

16. బలహీనంగా అనిపించడం

17. ఆలోచించలేకపోవడం

18. వణుకు, ఆందోళన

19. నాలుక, పెదవులు మొద్దుబారటం 

20. గుండె వేగంగా కొట్టుకోవడం .. ఇవన్నీ డయాబెటీస్ లక్షణాలుగా వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి సమస్యలుంటే.. వెంటనే గుర్తించి డాక్టర్‌ను సంప్రదించి వారి సలహా మేరకు జాగ్రత్తలు తీసుకోవాలి.