సోమవారం 18 జనవరి 2021
Health - Dec 01, 2020 , 18:53:06

ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు ఇవే మందులు..!

ఇర్రెగ్యులర్ పీరియడ్స్‌కు ఇవే మందులు..!

హైద‌రాబాద్ : చాలా మంది స్త్రీలు ఇర్రెగ్యులర్ పీరియడ్స్ సమస్యతో బాధపడుతుంటారు. అంటే నెలసరి సమయం దాటినా రాకపోవ‌డం, సరైన సమాయానికి ముందే రావడం అన్నమాట. దీన్ని ఒలిగోమెనోరియా అని కూడా పిలుస్తారు. హార్మోన్ల మార్పులు, ఒత్తిడి, అధిక వ్యాయామం లాంటి వాటి వల్ల కూడా ఇర్రెగ్యుల్ పీరియడ్స్ వస్తుంటాయి. ఈ సమస్యతో బాధ పడుతున్నవారు దీని నుంచి తప్పించుకునేందుకు రకరకాల మెడిసిన్ వాడుతుంటారు. అయితే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ను పిల్స్ వేసుకోకుండానే తగ్గించుకునేందుకు కొన్ని మార్గాలున్నాయట.

సహజంగా నెలసరి అనేది 25 నుంచి 35 రోజులకు ఒకసారి వస్తుంది. ఆ సమయంలో రోజుకు రెండు లేదా మూడు శానిటరీ ప్యాడ్స్ ఉపయోస్తున్నారంటే నెలసరి మామూలుగా ఉన్నట్లు. ఇలా ప్రతి నెల రెండు, మూడు రోజులు అటు ఇటుగా పీరియడ్స్ రావడం అనేది సహజ ప్రక్రియ. కానీ చాలా మంది స్త్రీలకు ఇలా కాకుండా చాలా త్వరగా రావడం, నెలల తరబడి రాకుండా ఉండటం లాంటివి జరుగుతుంటాయి. 

ఇలా జరగడం కచ్చితంగా ప్రమాదమేనని.. ప్రతిసారి ఇలా అవుతుంటే వైద్యులను సంప్రదించక తప్పదని నిపుణులు చెబుతున్నారు. మరో వైపు.. మీ రోజువారి అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకుంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి తప్పించుకోవచ్చని సూచిస్తున్నారు. మీకు ఇలాంటి సమస్యలు ఉండి ఉంటే.. మీరు ఓ సారి ట్రై చేసి చూడండి. అవేంటంటే..

ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ దిక్సా బవ్సర్ చెబుతున్న దాని ప్రకారం.. ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కు ఇవే మందులు..

1. పౌష్టికాహారం తీసుకోవ‌డం 

2. చిన్న పేగులను ఆరోగ్యంగా కాపాడుకోవడం

3.  ఒత్తిడికి దూరంగా ఉండటం

4.  పుష్క‌లంగా నీరు తాగడం

5.  హార్మోన్ల మార్పులు రాకుండా చూసుకోవడం

6. ఓపిక, నమ్మకం, పట్టుదల కలిగి ఉండటం

మెడిటేషన్, యోగా లాంటివి చేస్తే మానసిక ఒత్తిడి నుంచి దూరమవచ్చు. అలాగే విటమిన్-డి, క్యాల్షియం లాంటివి స్త్రీలకు ముఖ్యంగా కావాల్సినవి. వీటి వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. మానసికంగా, శారీరకంగా ఆరోగ్యంగా ఉంటేనే ఇర్రెగ్యులర్ పీరియడ్స్ నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.