కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని తెలిపే ల‌క్ష‌ణాలు ఇవే..!

Thu,March 14, 2019 05:15 PM

నేడు ప్ర‌పంచ వ్యాప్తంగా చాలా మంది కిడ్నీ స్టోన్ల బారిన ప‌డుతున్నారు. కిడ్నీ స్టోన్ల స‌మ‌స్య చాలా మందికి వ‌స్తున్న‌ది. దీంతో ఏం చేయాలో తెలియిక స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. స్టోన్లు బాగా పెరిగే వ‌ర‌కు తెలియ‌కుండా ఉంటుండ‌డంతో స‌మ‌స్య తీవ్ర‌త‌ర‌మై ఆపరేష‌న్ వ‌ర‌కు దారి తీస్తున్న‌ది. అయితే కిడ్నీ స్టోన్లను నిజానికి ఆరంభంలోనే గుర్తించ‌వ‌చ్చు. అప్పుడు మ‌న శ‌రీరం మ‌న‌కు ప‌లు ల‌క్ష‌ణాలు, సూచ‌న‌ల‌ను తెలియ‌జేస్తుంది. వాటిని గుర్తించి నిర్దారిస్తే.. కిడ్నీ స్టోన్ల‌ను ఆరంభంలోనే తొల‌గించుకోవ‌డం చాలా సుల‌భ‌త‌రం అవుతుంది. మ‌రి కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని తెలిపేందుకు మ‌న శ‌రీరంలో ఎలాంటి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయో ఇప్పుడు తెలుసుకుందామా..!


1. కిడ్నీ స్టోన్లు ఉంటే వీపు కింద కుడి లేదా ఎడ‌మ ప‌క్క‌న నొప్పి వ‌స్తుంటుంది. లేదా ముందు వైపు బొడ్డు కింద కుడి లేదా ఎడ‌మ వైపు నొప్పి ఉంటుంది. ఆ నొప్పి కూడా పోటు పొడిచిన‌ట్లుగా వ‌స్తుంది. దాన్ని గ‌మ‌నిస్తే కిడ్నీ స్టోన్లు ఉన్నాయో, లేవో చెప్ప‌వ‌చ్చు. ఆ నొప్పి గ‌న‌క వ‌స్తుంటే డాక్ట‌ర్‌ను క‌ల‌సి వైద్య పరీక్ష‌లు చేయించాలి. దీంతో కిడ్నీ స్టోన్లు ఉంటే తెలిసిపోతుంది. ఆ మేర‌కు చికిత్స తీసుకుంటే వెంట‌నే స్టోన్ల‌ను తొల‌గించుకోవ‌చ్చు.

2. మూత్రం పోసే స‌మ‌యంలో మంట లేదా నొప్పి ఉంటే కిడ్నీ స్టోన్లు ఉన్న‌ట్లేన‌ని గ‌మ‌నించాలి.

3. షుగ‌ర్ వ‌చ్చిన వారికే కాదు, కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి కూడా త‌ర‌చూ మూత్రం వ‌స్తుంటుంది. మూత్రానికి ఎక్కువ సార్లు వెళ్తారు.

4. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారి మూత్రం ర‌క్తం రంగులో ఉంటుంది. లేదా కొన్ని సార్లు రక్తం కూడా ప‌డ‌వ‌చ్చు. అలాగే మూత్రం దుర్వాస‌న క‌లిగి ఉంటుంది.

5. కిడ్నీ స్టోన్లు ఉన్న‌వారికి మూత్రం ఒకేసారి రాదు. ఆగి ఆగి వ‌స్తుంటుంది.

6. వాంతికి వ‌చ్చిన‌ట్లు ఉండ‌డం, వికారం, వ‌ణ‌క‌డం, జ్వ‌రం రావ‌డం వంటి ల‌క్ష‌ణాలు ఉంటే.. కిడ్నీ స్టోన్లు ఉన్నాయ‌ని అర్థం చేసుకోవాలి. ఆ మేర‌కు డాక్ట‌ర్‌ను క‌లిసి ప‌రీక్ష‌లు చేయించుకుని చికిత్స తీసుకోవాలి..!

9255
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles