కోళ్ల ఉత్పత్తులపై ఎలాంటి అపోహలు వద్దు

Tue,December 10, 2019 08:28 AM

బండ్లగూడ: దేశంలో పౌష్ఠికాహారం అందించడంతో పాటు కోళ్ల ఉత్పత్తుల వినియోగం పెంచాల్సిన అవసరం ఉందని జాతీయ కోళ్ల పరిశోధన సంస్థ డైరెక్టర్ చటర్జీ పేర్కొన్నారు. సోమవారం రాజేంద్రనగర్‌లోని కోళ్ల పరిశోధన సంస్థలో కోళ్ల పరిశోధన శాస్త్రవేత్తలు, రైతులతో సమావేశాన్ని నిర్వహించారు. డాక్టర్ చికెన్ సంస్థ, జాతీయ కోళ్ల పరిశోధన సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన చటర్జీ మాట్లాడుతూ.. ప్రపంచంలో భారతదేశాన్ని గుడ్ల ఉత్పత్తిలో రెండవ స్థానం, మాంసం ఉత్పత్తిలో మూడవ స్థానంలో ఉండేలా పౌల్ట్రీ పరిశ్రమలు పనిచేయాలన్నారు. ప్రతి పౌరుడు సంవత్సరానికి 180 గుడ్లను, 12కేజీల చికెన్ మాంసాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.


కోళ్ల పరిశ్రమ శాస్త్ర డాక్టర్ సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. కోళ్ల పరిశ్రమలలో యాంటి బయోటిక్ మందులను వాడటం లేదని, ఈ విషయమై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. పౌల్ట్రీ ఫారానికి మంచినీరు, గాలి, ఉష్ణోగ్రతలు, శాస్త్రీయమైన పద్ధతులు పాటిస్తే యాంటి బయోటిక్ మందులు వాడాల్సినవసరం లేదన్నారు. డాక్టర్ చికెన్స్ సంస్థ అధినేత డాక్టర్ రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ.. కోళ్ల ఉత్పత్తులపై అపోహలు వద్దని, కోడి మాంసం, గుడ్లను తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి హాని ఉండదన్నారు. పౌల్ట్రీ ఫాంలలో ఆంటి బయోటిక్ మందులను వాడటం లేదనీ, వీటిపై ప్రజలకు అవగాహన పెంచాల్సినవసరం ఉందన్నారు.

1829
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles