రక్తంలో తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ల (ఎల్డీఎల్) స్థాయిలు అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లను (హెచ్‌డిఎల్) మించడాన్ని అధిక కొలెస్ట్రాల్ అంటారు. తద్వారా ధమనుల్లో గార పేరుకుపోతుంది. చూస్తూ ఊరుకుంటే కాలక్రమేణా ఇది దీర్ఘకాలిక గుండె జబ్బులు, గుండెపోటు లేదా స్ట్రోక్ ప్రమాదాన్ని పెంచుతుంది. ఎలాంటి లక్షణాలు లేకుండా గుండెపోటు లేదా స్ట్రోక్ వచ్చే ప్రమాదం పొంచి ఉంది. అయితే, కళ్లను చూసి హై కొలెస్ట్రాల్ ఉందో లేదో తెలుసుకోవచ్చని అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ డాక్టర్లు చెబుతున్నారు.
ముఖంపై కనిపించే హై కొలెస్ట్రాల్ సంకేతాలు..
ఆర్కస్ సెనిలిస్..ముఖంపై ఒక ప్రధాన హెచ్చరిక గుర్తు. కంటిలో నీలం-బూడిద రంగు రింగ్ కలిగి ఉంటుంది. కార్నియల్ ఆర్కస్ అని పిలుస్తారు. కనుపాప చుట్టూ నీలం-బూడిద రంగు రింగ్ అభివృద్ధి చెందుతుంది. కొలెస్ట్రాల్ వల్ల ఇది క్రమంగా ఏర్పడుతుంది. ఈ రింగ్ కొలెస్ట్రాల్‌తో తయారైనట్లు అమెరికన్ అకాడమీ ఆఫ్ ఆప్తాల్మాలజీ చెబుతోంది. కార్నియా సాధారణంగా స్పష్టంగా ఉంటుంది. ఆర్కస్ సెలినిన్ ఉంటే కంటి ఐరిస్ చుట్టూ రింగ్ వివిధ షేడ్స్‌లో కనిపిస్తుంది. .
ఆర్కస్ సెనిలిస్ ఎలా వస్తుంది?
ఆర్కస్ సెనిలిస్ తరచుగా కార్నియా ఎగువ, దిగువ భాగంలో చిన్న ఆర్క్ వలె ప్రారంభమవుతుంది. కాలక్రమేణా పూర్తి రింగ్‌గా అభివృద్ది చెందుతుంది. వృద్ధాప్యంలో సాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్నవారిలో కూడా ఇది ఏర్పడుతుంది. అయినప్పటికీ, 45 ఏళ్లలోపు వారిలో రింగ్ ఏర్పడితే, అది అధిక కొలెస్ట్రాల్ లక్షణం కావొచ్చు.
అధిక కొలెస్ట్రాల్‌ని నిర్ధారించడానికి ఉత్తమ మార్గం రక్త పరీక్ష. ఇందులో హై కొలెస్ట్రాల్ ఉన్నట్లు తేలితే వైద్యులు పలు మందులను సిఫారసు చేయవచ్చు లేదా మెరుగైన నిర్వహణ కోసం జీవనశైలి మార్పులను సూచించవచ్చు. వీటితోపాటు కొవ్వు పదార్థాల (సంతృప్త లేదా ట్రాన్స్‌ఫ్యాట్)ను తీసుకోవడం తగ్గించాలి. ధూమపానం, మద్యపానానికి దూరంగా ఉండాలి. బరువు తగ్గేందుకు ప్రతిరోజూ తప్పనిసరిగా వ్యాయామం చేయాలి.