ఆమె తయారు చేసిన నాప్కిన్స్ భూమిలో కలిసిపోతాయట

Fri,March 8, 2019 03:20 PM

ఆడవాళ్లకు బహిష్టు సమయంలో అవసరమయ్యే శానిటరీ నాప్కిన్స్ చౌకగా తయారుచేసిన అరుణాచలం ప్యాడ్‌మ్యాన్‌గా పేరుతెచ్చుకున్నారు. ఓ పురుషుడై ఉండి స్త్రీల బాధలను అర్థం చేసుకుని సులభంగా లభించే పదార్థాలతో నాప్కిన్స్ తయారుచేసి చూపించి రికార్డు సృష్టించారు. ఆయన కృషి గురించి ఏకంగా అక్షయ్‌కుమార్ నాయకుడుగా ప్యాడ్‌మ్యాన్ పేరుతోనే ఆ మధ్య ఓ సినిమా కూడా వచ్చింది. ఇప్పుడు ఆయనకు పోటీగా ప్యాడ్‌వుమన్ తెరమీదకు వచ్చారు. నాప్కిన్స్ చౌకగా తయారు చేయడం అరుణాచలం ప్రత్యేకత అయితే పర్యావరణానికి హానిచేయని, మట్టిలో కలిసిపోయే నాప్కిన్స్ తయారు చేయడం ప్యాడ్‌వుమన్ ఘనతగా చెప్పుకోవాలి. మనం మాట్లాడుకుంటున్న ప్యాడ్‌వుమన్ పేరు ప్రీతి రాందాస్. ఈమె అన్నా యూనివర్సిటీలో పీహెచ్‌డీ చేస్తున్నారు. ప్రస్తుత నాప్కిన్స్‌లో ఎంతోకొంత ప్లాస్టిక్ ఉంటుంది. అది అతిమంగా భూమిలోకి చేరుతుంది. కానీ ప్యాడ్‌వుమన్ అభివృద్ధి చేసిన నాప్కిన్‌లో ప్లాస్టిక్ అసలే ఉండదు. సేంద్రియ పదార్థాలనుంచి తీసిన సెల్యులోజ్ వంటివాటితో ఆమె ఆమె వీటిని తయారు చేశారు. తాను రూపొందించిన నాప్కిన్ నెలరోజుల్లో మట్టిలో కలిసిపోతుందని ప్రీతి వెల్లడించారు. ఈమె పీహెచ్‌డీ సబ్జక్టు కూడా ఇదే. అన్నా యూనివర్సిటీకి చెందిన క్రిస్టల్ గ్రోత్ సెంటర్ ప్రీతి తయారు చేసిన నాప్కిన్‌ను అన్నిరకాలుగా పరీక్షించి నిగ్గుతేల్చింది. సాదారణంగా యూనివర్సిటీవారే ఫలానా సబ్జక్టు మీద పీహెచ్‌డీ చేయమని నిర్దేశిస్తారు. కానీ ప్రీతి మాత్రం మొండిగా పర్యావరణ అనుకూల నాప్కిన్స్ తయారు మీదే పరిశఓధనలు చేస్తానని పట్టుబట్టింది. మొదట్లో యూనివర్సిటీ అధికారులు వారించాలని చూశారు. కానీ ప్రీతి మొండిపట్టు చూసి సరేనన్నారు. ఇప్పుడామె పరిశోధన ఫలించి పర్యావరణానికి హానిచేయని నాప్కిన్స్ రూపొందడంపై యూనివర్సిటీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

3061
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles