బుధవారం 30 సెప్టెంబర్ 2020
Health - Jul 25, 2020 , 18:16:37

మాస్కులో తప్పకుండా రెండు పొరలుండాలి

మాస్కులో తప్పకుండా రెండు పొరలుండాలి

మెల్‌బోర్న్‌ :  కరోనా మహమ్మారి నుంచి రక్షించుకోవడంలో మాస్కు ధరించడం తప్పనిసరి అని తెలిసిందే.  ప్రస్తుత పరిస్థితుల్లో ఎక్కువ మంది తమ ఇండ్లలోనే బట్టతో సొంతంగా మాస్కులు సిద్ధం చేసుకుంటున్నారు. మరి - ఇంట్లో  తయారు చేసుకునే ఈ మాస్కులకు కనీసం రెండు పొరలు ఉండాల్సిందేనని తాజాగా చేపట్టిన అధ్యయనం ఒకటి నిర్ధరించింది.  అలా అయితేనే అవి కొవిడ్‌-19  వైరస్‌ వ్యాప్తిని నిలువరించగలవని తేల్చింది.  ముఖకవచానికి మూడు పొరలుంటే మరింత మంచిదని తెలిపింది. ఆస్ట్రేలియాలోని న్యూ సౌత్‌ వేల్స్‌ యూనివర్సిటీ  పరిశోధకులతో కూడిన బృందం తాజాగా అధ్యయనం నిర్వహించింది.

సాధారణంగా వ్యక్తులు మాట్లాడిన, తుమ్మినా, దగ్గినా తుంపర్లు వస్తుంటాయి.  కరోనా బాధితులు నుంచి వచ్చే తుంపర్లలో వైరస్‌ వెలువడుతుంది. ఇండ్లలో తయారు చేసుకునే ముఖకవచాలు ఈ తుంపర్లను ఎంతమేరకు అడ్డుకోగలుగుతున్నాయనే అంశాన్ని సర్జికల్‌ మాస్కులు సమర్థతతో శాస్త్రవేత్తలు తాజా అధ్యయనంలో పోల్చి చూశారు. పరిశోధనలో భాగంగా ఎల్‌ఈడీ కాంతి వ్యవస్థ, హై స్పీడ్‌ కెమెరాతో తుంపర్ల వెలువడే విధానాన్ని పరిశీలించారు.  తుంపర్లను సర్జికల్‌ మాస్కులు ఎంతో సమర్థవంతంగా  అడ్డుకుంటున్నయని నిరూపించారు.  ఇంట్లో  ఒక పొరతో  తయారు చేసుకునే మాస్కుతో మాట్లాడినపుడు తుంపర్లను అడ్డుకోగలిగిన దగ్గినా, తుమ్మినా వచ్చే తుంపర్లను ఏమాత్రం  నిరోధించలేకపోతున్నాయని గుర్తించారు.   రెండు పొరలతో తయారు చేసిన మాస్కులు ఈ విషయంలో కొంత మేరకు సమర్ధవంతంగా పనిచేస్తాయని. మూడు పొరలతో ఉన్న మాస్కు మరింత ప్రభావంతంగా ఉంటుందని వారు తేల్చారు. 


logo