శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 20:32:23

రాత్రిపూట ఇవి తింటే మేలు

రాత్రిపూట ఇవి తింటే మేలు

  • రాత్రిపూట ఎలాంటి ఆహారం తీసుకోవాలి అన్న డైలమాలో ఉన్నారా ? ఏం తింటే ఏమవుతుందో అని కంగారు పడుతున్నారా ? కొందరు రైస్ తినకూడదు అంటారు, మరికొందరు పెరుగు తినకూడదు అంటారు. కొంతమంది ఫ్రూట్స్ తినాలి అని చెప్తే.. మరికొంతమంది నాన్ వెజ్ తినకూడదని సూచిస్తారు. అసలు రాత్రిపూట ఏం తినాలి ?
  • పడుకునే ముందు ఆహారం ఎంత తేలికగా ఉంటే అంత మంచిది. తేలికైన ఆహారం వల్ల త్వరగా జీర్ణమవుతుంది. అలాగే.. కంటినిండా నిద్ర పడుతుంది. పడుకోవడానికి ముందు ఎలాంటి ఆహారం హెల్తీగా ఉంటుంది అనేదానిపై స్టడీస్ జరిగాయి. కొన్ని రకాల ఆహార పదార్థాలు పడుకోవడానికి ముందు తీసుకుంటే.. మంచిదని ఈ అధ్యయనాలు సూచిస్తున్నాయి. వీటిని తీసుకోవడం వల్ల మంచి ఫలితాలు కనిపిస్తాయి.
  • కప్పు రైస్ :రాత్రిపూట భోజనంలో ఒక చిన్న కప్పునిండా రైస్ తీసుకోవడం వల్ల మంచి నిద్ర వస్తుందని అధ్యయనాలు నిరూపించాయి. ఇది నిద్రలేమి సమస్య రిస్క్ ని తగ్గిస్తుంది. అలాగే కంటినిండా నిద్రపట్టేలా చూస్తుందట.
  • పాప్ కార్న్ :ప్రతి ఒక్కరూ పాప్ కార్న్ తినడానికి ఇష్టపడతారు. కానీ కొంతమంది వీటిని రాత్రిపూట తినకూడని చెబుతుంటారు. కానీ అది తప్పు. రోజూ రాత్రి పూట పాప్ కార్న్ తీసుకోవడం వల్ల.. మెటబాలిజం స్థాయి పెరిగి.. మంచి నిద్ర పొందగలుగుతారని అధ్యయనాలు చెబుతున్నాయి.
  • అరటిపండు :అరటిపండులో విటమిన్ డి, క్యాల్షియం ఎక్కువగా ఉంటాయి. ఇవి మనిషికి సుఖవంతమైన నిద్ర అందించడానికి సహాయపడతాయి. ఒకవేళ అరటిపండుతోపాటు కాస్త పంచదార కలుపుకుని తీసుకుంటే.. మెగ్నీషియం పెరిగి, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి సహాయపడుతుంది.
  • అల్లం టీ :రాత్రి నిద్రకు ముందు అల్లం టీ చాలా మంచిదని అనేక అధ్యయనాలు నిరూపించాయి. అల్లం టీ తాగడం వల్ల అది మీ మెదడుకి రెస్ట్ తీసుకోవాలని సూచిస్తుందతట. పనిచేయడం ఆపేయాలని సంకేతం పంపుతుంది.
  • పాలు : ఒక గ్లాసు పాలు రాత్రిపూట తాగడం వల్ల.. మీ నరాలు రిలాక్స్ అవడానికి సహాయపడుతుంది. అలాగే బ్లడ్ సర్క్యులేషన్ సజావుగా సాగడానికి సహాయపడుతుంది.
  • ఎండు కర్జూరాలు :జీర్ణక్రియ సమస్యలను తగ్గించే పదార్థాలు ఎండు కర్జూరాల్లో దాగున్నాయి. రోజూ 3 నుంచి 4 ఎండు కర్జూరాలు తినొచ్చు. దీనివల్ల నిద్ర కూడా పడుతుంది.


logo