ఈ స్నాక్స్ తింటే గుండెను కాపాడుకోవచ్చు!

సాధారణంగా స్నాక్స్ అంటే ఆరోగ్యానికి మంచిది కాదంటుంటారు. ఎందుకంటే స్నాక్స్ అనగానే మనకు చిప్స్, బజ్జీలు, కుకీస్ లాంటివే గుర్తొస్తాయి. ఇవి అయితే కచ్చితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేవే. ఎందుకంటే వీటిలో చెక్కర, ఉప్పు, సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటాయి. ఇవి చాలా రకాల ఆరోగ్య సమస్యలకు కారణమవుతాయి. కానీ.. సరైన ఆహారపదార్థాలను స్నాక్స్‌గా తినడం వల్ల ఎలాంటి సమస్య ఉండదు. పైగా శరీరానికి సరైన సమయంలో చాలా న్యూట్రిషియన్లు అందుతాయని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
శరీరానికి కావాల్సిన ఫైబర్, విటమిన్స్, మినరల్స్, యాంటీ-ఆక్సిడెంట్లను అందించే పళ్లు, కూరగాయలు, చిక్కుళ్లు, నట్స్, గింజలు, చిరుధాన్యాల వంటి వాటిని స్నాక్స్ గా తీసుకుంటే మేలు. అయితే.. మనం తినే ఆహారంలో కనీసం 3 గ్రాముల ఫైబర్, 200 మిల్లీ గ్రాముల లోపు ఉప్పు, 15-20 గ్రాముల లోపు సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటే ఆరోగ్యానికి ముఖ్యంగా గుండెకు చాలా మంచిదని చెబుతున్నారు. ఇలా మన గుండె ఆరోగ్యాన్ని కాపాడేందుకు 10రకాల స్నాక్స్ ఉన్నాయి. అవేంటో చూద్దాం
1. నట్స్ లేదా వెన్నతో కలిపిన యాపిల్స్
జీడిపప్పు, బాదం, పిస్తా లాంటి నట్స్ ఆరోగ్యానికి మేలు చేసేవని తెలిసిందే. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల గుండె జబ్బుల బారిన పడకుండా ఉంటున్నారని తాజాగా 25 స్టడీల్లో తేలిందట. అలాగే ఫైటోన్యూట్రియన్లు, పెక్టిన్ కలిగి ఉన్న యాపిల్ కూడా గుండె సమస్యలను అరికడుతుంది. కాబట్టి యాపిల్ ముక్కలను వీటితో కలిపి స్నాక్స్ గా తీసుకుంటే రుచితో పాటు ఆరోగ్యం మీ సొంతం.
2. వేయించిన పచ్చి బఠానీలు
పచ్చి బఠానీలు తినడం గుండెకు చాలా మంచిది. వీటిలోని ఫైబర్, స్టెరాల్స్, సిటోస్టెరాల్ వంటివి శరీరంలో కొవ్వును తగ్గించి గుండె జబ్బులు రాకుండా కాపాడతాయి. కాబట్టి సాయంత్రం స్నాక్స్ టైంలో వీటిని వేయించుకుని తినడం వల్ల స్పైసీ అండ్ టేస్టీగా మీ సాయంత్రం గడుస్తుంది.
3. విత్తనాలు
చియా విత్తనాలు, పంచ్ విత్తనాలు, అవిసె గింజలు, జనపనాల గింజలలో ఓట్స్, నట్స్ లాంటివి కలిపి ముద్దలు చేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా రకాలుగా మేలు కలుగుతుందట. వీటిలోని ఒమెగా-3 ఫ్యాటీ యాసిడ్ గుండెల్లో నొప్పి, మంట రాకుండా కాపాడతాయి.
4. చిరుధాన్యాలు
చిరుధాన్యాల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది శరీరంలో కొవ్వును తగ్గిస్తుంది. హమ్మస్(ఇదొక వంటకం) లాంటివి కలుపుకుని తినడం వల్ల మీ శరీరానికి మరింత ఫైబర్ తో పాటు.. ఆరోగ్యకరమైన కొవ్వు అందుతుంది.
5. వేయించిన క్యారెట్లు
క్యారెట్లను బాగా వేయించి తీసుకోవడం వల్ల రుచి కరమైన స్నాక్స్ తినడమే కాక, మీ గుండెకు కావాల్సిన ఫ్యాట్ ను అందించిన వారవుతారు. అయితే ఇక్కడ క్యారెట్లను ఆలివ్ ఆయిల్ తో వేయించడం శ్రేయస్కరం.
6. స్పైసిడ్ నట్స్
బాదం, పిస్తా లాంటి పచ్చి నట్స్ తినీ తినీ బోర్ కొట్టిందా. అయితే మీకు నచ్చిన నట్స్ లేదా గింజలు తీసుకొండి. వాటిని ఆలివ్ ఆయిల్ లో వేయించి వాటిపై మీకు నచ్చిన మసాలాలు చల్లుకుని తినండి.
7. గుమ్మడికాయ గింజలు
గుమ్మడికాయ గింజల్లో అధికంగా లభించే మెగ్నీషియం బ్లడ్ ప్రెజర్ తగ్గించడమే కాక.. గుండె జబ్బులు రాకుండా కాపాడతుంది. దీంతోపాటు వీటిలో ఫైబర్, అన్-సాచురేటెడ్, ప్రొటీన్లు అన్నీ గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటిని చక్కగా వేయించుకుని వాటికి నట్స్ లాంటివి జత చేసుకుంటే టేస్టీ అండ్ హెల్తీ స్నాక్స్ మీ సొంతం.
8. ఆకుకూరలు
ఆకుకూరల్లో చాలా న్యూట్రియన్లు ఉంటాయి. అవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. దీంతో పాటు వీటిలో ఉండే పొటాషియం రక్తప్రసరణ తగ్గిస్తాయి.
9. పెరుగుతో కూడిన బెర్రీస్
చాలా మంది పాల పదార్థాలు గుండెకు మంచివి కాదంటారు. కానీ నిజానికి పెరుగు గుండెకు చాలా మంచిదని తాజాగా చేసిన స్టడీలు చెబుతున్నాయి. కానీ కేవలం పెరుగు తినడానికి చాలా మంది ఇష్టపడరు కాబట్టి దీంట్లో చెక్కర లాంటివి వేసుకుంటారు. అయితే చెక్కరకు బదులు చెర్రీలు కలుపుకుని తింటే మంచిదని నిపుణులు చెబుతున్నారు.
10. కందికాయ
కందికాయను సాధారణంగా సరదాగా తింటారు. కానీ నిజానికి ఇవి ఆరోగ్యానికి చాలా మంచి చేస్తాయట. వీటిలో కొవ్వు శాతం తక్కువగా ఉండటంతో పాటు ఫైబర్, పాలీ-అన్ సాచురేటెడ్ ఫ్యాట్, ఫైటో న్యూట్రియన్లు గుండె ఆరోగ్యాన్ని కాపాడతాయి. వీటికి కాస్త నిమ్మరసం, పిప్పర్ లాంటివి జత చేసుకుని తింటే బాగుంటుంది.
తాజావార్తలు
- ధోనీ క్రికెట్ అకాడమీ ప్రారంభం
- కనకరాజుకు మంత్రులు హరీశ్‌రావు, సత్యవతి అభినందనలు
- మృతదేహాన్ని తరలిస్తూ మరో ఐదుగురు దుర్మరణం..!
- అన్నింటికీ హింస పరిష్కారం కాదు : రాహుల్ గాంధీ
- సిక్సర్ బాదిన సన్నీ లియోన్
- గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న గవర్నర్ బండారు దత్తాత్రేయ
- 'సన్‌షైన్ మంత్ర' ఫాలో కండి: రకుల్
- మధ్యాహ్నం కునుకు.. ఆరోగ్యానికి ఎంతో మంచిది..!
- ఎర్రకోటపై జెండా పాతిన రైతులు
- మిషన్ భగీరథ..అచ్చమైన స్వచ్ఛ జలం