సోమవారం 25 మే 2020
Health - Apr 02, 2020 , 21:42:41

ఇలా చేస్తే దంతాలు క్షేమం

ఇలా చేస్తే దంతాలు క్షేమం

  • దంత బాధకు మూలాన్ని ప్రారంభంలోనే గుర్తిస్తే చాలావరకు ఫిల్లింగ్‌తోనే సమస్య పోతుంది. రూట్‌కెనాల్‌ దాకా వెళ్లే అవసరం ఉండదు. మధుమేహం ఉన్నవారు ఇన్‌ఫెక్షన్లకు లోనయ్యే అవకాశం మరీ ఎక్కువ. వారు ఏ కాస్త చిగురు సమస్య వచ్చినా వెంటనే చికిత్స తీసుకోవాలి. 
  • రాత్రివేళ లాలాజలం ఉత్పత్తి కాదు. ఈ కారణంగా రాత్రివేళలోనే దంతాలు ఎక్కువగా బాక్టీరియా బారిన పడతాయి. అందుకే రాత్రివేళ బ్రష్‌ చేసుకోవడం అతి ముఖ్యం. తరచూ నోటిని పుక్కిళించడం కూడా ఎంతో శ్రేయస్కరం. 
  • చిగుళ్లలో ఇన్‌ఫెక్షన్లు మరీ అధికంగా ఉన్నప్పుడు మౌత్‌వాష్‌ ద్రావణంతో పుక్కిళించడం అవసరం. మామూలుగా అయితే సాధారణ నీటితో పుక్కిళించినా చాలు. 
  •  బ్రష్‌తో శుభ్రం చేసుకున్నాక నిత్యం చూపుడువేలును నిటారుగా ఉంచి, చిగుళ్ల మీద సున్నితంగా మర్దన చేయాలి. దీనివల్ల చిగుళ్లలో రక్తప్రసరణ పెరిగి ఇన్‌ఫెక్షన్ల అవకాశం తగ్గుతుంది. పైగా చిగుళ్లు దంతాలను బాగా అతుక్కుని ఉండేందుకు ఆస్కారం ఉంటుంది. 


logo