కొలెస్ట్రాల్ స‌మ‌స్య‌ల‌కు చెక్ పెట్టే విట‌మిన్ బి3..!

Wed,April 17, 2019 12:58 PM

మ‌న శ‌రీరానికి అవ‌స‌ర‌మ‌య్యే ఎన్నో పోష‌కాల్లో విట‌మిన్ బి3 కూడా ఒక‌టి. దీన్నే నియాసిన్ అని కూడా అంటారు. ఇది మ‌న శ‌రీరంలో కొలెస్ట్రాల్ స్థాయిల‌ను నియంత్రిస్తుంది. అలాగే ప‌లు ఇత‌ర ముఖ్య‌మైన ప‌నుల‌కు కూడా మ‌న‌కు విట‌మిన్ బి3 కావాలి. నిత్యం పురుషుల‌కు అయితే 16 మిల్లీగ్రాముల నియాసిన్ అవ‌స‌రం. అదే మ‌హిళ‌ల‌కు అయితే 14 మిల్లీగ్రాముల నియాసిన్ స‌రిపోతుంది. ఈ క్ర‌మంలో ప్ర‌తి ఒక్క‌రు నిత్యం విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను తీసుకోవాలి.


విట‌మిన్ బి3 మ‌న‌కు చికెన్ బ్రెస్ట్, కాలేయం, ఆకుకూర‌లు, గింజ‌లు, ట్యూనా ఫిష్‌, ప‌చ్చి బ‌ఠానీలు, మ‌ట‌న్ త‌దిత‌ర ఆహారాల్లో ల‌భిస్తుంది. ఈ ఆహారాల‌ను నిత్యం తీసుకుంటే విట‌మిన్ బి3 మ‌న‌కు స‌రిగ్గా అందుతుంది. త‌ద్వారా ఈ విట‌మిన్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు. నియాసిన్ మ‌న జీర్ణ వ్య‌వ‌స్థ ప‌నితీరుకు కూడా ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది. ఇది ఆక‌లిని పెంచుతుంది. చ‌ర్మాన్ని కాంతివంతంగా మారుస్తుంది. నాడీ వ్య‌వ‌స్థ‌ను స‌రిగ్గా పనిచేసేలా చేస్తుంది.

శ‌రీరంలో చెడు కొలెస్ట్రాల్ ఉన్న‌వారు నిత్యం విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. లైంగిక స‌మ‌స్య‌లు ఉన్న‌వారు కూడా ఈ విట‌మిన్ ఉన్న ఆహారాల‌ను తీసుకుంటే ఫ‌లితం ఉంటుంది. డ‌యాబెటిస్ ఉన్న‌వారు విట‌మిన్ బి3 ఉన్న ఆహారాల‌ను త‌ర‌చూ తీసుకుంటే షుగ‌ర్ స్థాయిలు నియంత్ర‌ణ‌లో ఉంటాయి.

3048
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles