రోజూ 30 గ్రాముల ఫైబర్‌తో అధిక బరువుకు చెక్..!


Tue,January 2, 2018 06:37 PM

అధిక బరువును తగ్గించుకోవాలని అనుకుంటున్నారా ? నడుం సైజ్ చిన్నగా కావాలని కోరుకుంటున్నారా ? అయితే అందుకు రోజూ 30 గ్రాముల ఫైబర్ (పీచు పదార్థం) తినండి. ఫైబర్ ఉండే ఆహారాలను రోజూ తింటే దాంతో అధిక బరువే కాదు, నడుం సైజ్ కూడా చాలా వరకు తగ్గుతుందని పరిశోధకులు చెబుతున్నారు.

స్వీడన్‌లోని యూనివర్సిటీ ఆఫ్ గోథెన్‌బర్గ్‌కు చెందిన సైంటిస్ట్ గున్నార్ సి హాన్సన్ తన పరిశోధక బృందంతో కలిసి ఫైబర్-అధిక బరువు అనే అంశంపై ఇటీవలే పరిశోధనలు చేశారు. ఈ క్రమంలో వారు 4051 మందికి చెందిన ఆహారపు అలవాట్లను అడిగి తెలుసుకున్నారు. వారు రోజూ తీసుకునే ఆహారాలను తెలుసుకుని వాటిల్లో ఉండే ఫైబర్ శాతాన్ని లెక్కించారు. అనంతరం పరిశోధన ఫలితాలను వెల్లడించారు. ఈ క్రమంలో వారు చెబుతున్నదేమిటంటే.. నిత్యం 30 గ్రాముల ఫైబర్ శరీరానికి అందేలా ఫైబర్ ఉన్న ఆహారాలను తింటే దాంతో అధిక బరువు చాలా వరకు తగ్గుతుందని, నడుం సైజ్‌ను తగ్గించుకోవచ్చని వారు అంటున్నారు. అంతేకాకుండా శరీరం ఇన్సులిన్ ఉత్పత్తిని అధికం చేస్తుందని, ఫలితంగా షుగర్ స్థాయిలు కంట్రోల్‌లో ఉంటాయని వారు అంటున్నారు. ఈ క్రమంలోనే ఫైబర్ ఎక్కువగా ఉండే బటానీలు, బ్రొకొలి, ఫిగ్స్, బెర్రీలు, తృణ ధాన్యాలు, బీన్స్, అవకాడోలు, బెండకాయలు, శనగలు, నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ వంటివి రోజూ తింటే అధిక బరువును త్వరగా తగ్గించుకోవచ్చని సదరు సైంటిస్టులు చెబుతున్నారు.

3898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles