ఉల్లిపాయను ఇలా తీసుకుంటే.. ఆ శక్తి పెరుగుతుంది..!


Wed,August 23, 2017 03:17 PM

నిత్యం మనం వివిధ వంటల్లో వాడే ఉల్లిపాయతో ఎన్నో ఆరోగ్యకర ప్రయోజనాలు కలుగుతాయని అందరికీ తెలిసిందే. వాటిలో ముఖ్యంగా చెప్పుకోదగినది శృంగార సామర్థ్యం. ఉల్లిపాయలు సహజసిద్ధమైన aphrodisiac గా పనిచేస్తాయి. అంటే ఇవి శృంగార సామర్థ్యాన్ని పెంచే సహజసిద్ధమైన ఔషధాలు అన్నమాట. కనుక ఉల్లిపాయలను తినడం వల్ల శృంగార సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు.

ఉల్లిపాయలను నిత్యం పచ్చిగా తింటే శృంగార సామర్థ్యం పెరగడమే కాదు, పురుషుల్లో వీర్యం ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. శారీరక దృఢత్వం కలుగుతుంది. రక్త సరఫరా మెరుగు పడుతుంది. టెస్టోస్టిరాన్ స్థాయిలు పెరుగుతాయి. దీంతో శృంగారంలో ఉత్తేజంగా పాల్గొంటారు.

అయితే ఉల్లిపాయను పచ్చిగా తినలేని వారు దాన్ని జ్యూస్‌గా చేసుకుని తాగవచ్చు. ఒక మీడియం సైజ్ ఉల్లిపాయను తీసుకుని కట్ చేసి మిక్సీలో వేయాలి. అందులో ఒక చిన్న అల్లం ముక్క వేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఆ మిశ్రమంలో నీరు పోసి అర గ్లాస్ మోతాదులో తాగవచ్చు. లేదంటే ఉల్లిపాయలను నీటిలో మరిగించి డికాషన్ చేసుకుని తాగవచ్చు. పచ్చి ఉల్లిపాయలను వంటల్లో, ఇతర ఆహార పదార్థాల్లో పెట్టుకుని తినవచ్చు. ఎలా తిన్నా ఉపయోగమే ఉంటుంది.

6716

More News

VIRAL NEWS