సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 14, 2020 , 22:02:04

పాలు, పెరుగుతో స్ట్రోక్ రాదు..

పాలు, పెరుగుతో స్ట్రోక్ రాదు..

హైదరాబాద్‌ : ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా పాలు, పెరుగు, మ‌జ్జిగే స్ట్రోక్ విరుగుడు. కాక‌పోతే కొంద‌రు పాలు తాగుతారు కాని మ‌జ్జిగ తాగ‌రు. మ‌రికొంద‌రు మ‌జ్జిగ తాగుతారు కాని పాలు తాగ‌రు. ఇలా ఉండ‌కూడ‌దు. అన్ని అల‌వాటు చేసుకోవాలి. ఆరోగ్యంగా ఉండేందుకు ఈ మూడు త‌ప్ప‌నిస‌రి. ఈ మాట‌లు ఎవ‌రో చెప్పిన‌వి కాదు స్వ‌యంగా ప‌రిశోధ‌న‌కులే చెబుతున్నారు. ఇకేం చెబుతున్నారో తెలుసుకోండి.

- మనిషి శరీరంలోని రక్తనాళాల్లో ఏదైనా అవరోధం కలగడాన్ని స్ట్రోక్ అంటారు. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే మెదడు కణాలు త్వరగా నిర్వీర్యం అవటం ప్రారంభిస్తాయి. 

- నిలువెత్తు మనిషిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తుంది. ఈ ప్రమాదకర స్థితి వల్ల మనిషి అకాల మరణం చెందుతాడు. 

- అయితే, మనం తినే ఆహారంలో భాగంగా పాలు, పెరుగు, జున్ను, పండ్లు బాగా తీసుకుంటే ఈ ముప్పును అధిగమించవచ్చని పరిశోధకులు చెబుతున్నారు.

- తొమ్మిది దేశాల్లోని 4.18 లక్షల మంది ఆహారపు అలవాట్లు, ఆరోగ్యాన్ని పరిశీలించి ఇంగ్లండ్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ పరిశోధకులు ఈ వివరాలు వెల్లడించారు. 

- ఫైబర్‌ అత్యధికంగా ఉండే పండ్లు, కూరగాయలు, కోడిగుడ్లు తిన్నా మెదడుకు సంబంధించిన ఆరోగ్య సమస్యలు తలెత్తవని చెప్పారు. 


logo