మన శ‌రీరంలో మాంగ‌నీస్ లోపిస్తే ఏమ‌వుతుందో తెలుసా..?

Sat,January 5, 2019 04:45 PM

మ‌న శ‌రీరానికి కావ‌ల్సిన ముఖ్య‌మైన పోష‌కాల్లో మాంగనీస్ కూడా ఒక‌టి. ఇది మ‌న శరీరంలో జరిగే జీవ‌క్రియ‌ల‌కు, ఎముక‌ల ఆరోగ్యానికి ఎంత‌గానో ఉపయోగ‌ప‌డుతుంది. అలాగే నిత్యం మ‌నం తీసుకునే ఆహారంలో ఉండే కార్బొహైడ్రేట్లు, కొవ్వుల‌ను సరిగ్గా జీర్ణం చేసేందుకు కూడా మాంగ‌నీస్ ప‌నికొస్తుంది. క‌నుక నిత్యం మాంగ‌నీస్ ఉండే ఆహారాల‌ను తీసుకోవాలి. లేదంటే పోష‌కాహార లోపం ఏర్ప‌డుతుంది. పురుషుల‌కు నిత్యం 2.3 మిల్లీగ్రాముల మాంగ‌నీస్ అవ‌స‌రం అయితే స్త్రీలకు నిత్యం 1.8 మిల్లీగ్రాముల మాంగ‌నీస్ అవ‌స‌రం అవుతుంది.


కంది ప‌ప్పు, పెస‌ర‌, శ‌న‌గ ప‌ప్పుల్లో మాంగ‌నీస్ పుష్క‌లంగా ఉంటుంది. వీటిని నిత్యం ఆహారంలో భాగం చేసుకోవాలి. అలాగే గుమ్మ‌డికాయ విత్త‌నాలు, నువ్వులు, పొద్దు తిరుగుడు విత్త‌నాలు, న‌ట్స్‌, ఓట్స్‌, బార్లీ, బ్రౌన్ రైస్‌, పైనాపిల్‌, ఆకుప‌చ్చ‌ని కూర‌గాయ‌లు, సోయాబీన్‌, కంద‌గ‌డ్డ‌లు, స్ట్రాబెర్రీలు, గ్రీన్ టీ, బ్లాక్ టీ, అర‌టి పండ్లు, ల‌వంగాలు, అల్లం, యాల‌కులు, ప‌సుపు, దాల్చినచెక్క త‌దిత‌ర ప‌దార్థాల్లోనూ మాంగ‌నీస్ ఉంటుంది. వీటిని ఆహారంలో భాగం చేసుకోవ‌డం ద్వారా మాంగనీస్ లోపం రాకుండా చూసుకోవ‌చ్చు.

శ‌రీరంలో మాంగ‌నీస్ లోపిస్తే ఎముక‌ల్లో ప‌టుత్వం త‌గ్గుతుంది. త్వ‌ర‌గా పెలుసుబారిపోయేందుకు అవ‌కాశం ఉంటుంది. పిల్ల‌ల్లో లోపం వ‌స్తే వారి ఎదుగుద‌ల స‌రిగ్గా ఉండ‌దు. మాంగ‌నీస్ లోపం ఉన్న‌వారికి సంతానం క‌లిగే అవ‌కాశం త‌క్కువ‌గా ఉంటుంది. డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు అవ‌కాశం ఉంటుంది. క‌నుక మాంగ‌నీస్ ఉన్న ఆహారాల‌ను రోజూ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. దీంతో ఆయా స‌మ‌స్యలు రాకుండా చూసుకోవ‌చ్చు.

6074
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles