బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 11, 2020 , 18:05:46

ఈ ఆపత్కాలంలో కాంటాక్ట్‌ లెన్స్‌ వద్దు.. కళ్లజోడుకు మారండి

ఈ ఆపత్కాలంలో కాంటాక్ట్‌ లెన్స్‌ వద్దు.. కళ్లజోడుకు మారండి

బెంగళూరు: కరోనా వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతుండటంతో కాంటాక్ట్‌ లెన్స్‌ వాడుతున్నవారు ముందుజాగ్రత్తగా కళ్లజోడుకు మారాలని నిపుణులు సూచిస్తున్నారు. ‘ప్రస్తుత పరిస్థితుల్లో మొహానికి మాస్క్‌ వాడటం తప్పనిసరి. అది నోరు ముక్కు ద్వారా వైరస్‌ వెళ్లకుండా అడ్డుకుంటుంది. అయితే కంటి నుంచి కూడా ఈ వైరస్‌ వ్యాప్తి చెందుతుందని చాలా మందికి తెలియదు. అందువల్ల దీన్ని నిరోధించడానికి కళ్లద్దాలు వాడటం మంచిదని నేత్ర వైధ్యులు పేర్కొంటున్నారు. అదేవిధంగా గంటకు 20 సార్లు  మనకు తెలియకుండానే ముఖంపై, కళ్లపైకి చేతులు పోతాయి. కాంటాక్ట్‌ లెన్స్‌ ఉపయోగిస్తున్న వారు ఇలా తమ కళ్లను చేతితో తాకడం వల్ల ఇన్ఫెక్షన్‌ వచ్చే ప్రమాదం ఉంది. అందుకే దీన్ని నివారించడానికి లెన్స్‌కు బదులుగా కళ్లజోడు ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు. కళ్లద్దాలు, మాస్కులు ఉపయోగించడంవల్ల కరోనా వైరస్‌ బారిన పడకుండా రక్షిస్తాయని పేర్కొన్నారు. 


logo