శనివారం 26 సెప్టెంబర్ 2020
Health - Jul 21, 2020 , 12:18:15

రోజూ పోయే నిద్ర స‌రిపోతుందో లేదో ఎప్పుడైనా తెలుసుకున్నారా?

రోజూ పోయే నిద్ర స‌రిపోతుందో లేదో ఎప్పుడైనా తెలుసుకున్నారా?

మ‌నిషికి ఆహారం, నీరు ఎంత ముఖ్య‌మో నిద్ర కూడా అంతే.. రెండు, మూడు రోజులు తిండి తిన‌క‌పోయినా ఉండొచ్చు కానీ, స‌రిగా నిద్ర‌పోకుంటే మాత్రం అనారోగ్యం బారిన ప‌డ‌డం ప‌క్కా. ప్ర‌తిరోజూ ఎప్పుడు నిద్ర వ‌స్తే అప్పుడు నిద్ర‌పోవ‌డం, ఎప్పుడు మెల‌కువ వ‌స్తే అప్పుడు లేవ‌డం మామూలే. ఏమ‌న్నా అంటే రోజుకు 7, 8 గంట‌లు నిద్ర‌పోతున్నామంటున్నారు. గంట‌లు స‌రే.. అది ఏ స‌మ‌యంలో నిద్ర‌పోతున్నారు. ఆ నిద్ర మన‌కు స‌రిపోతుందో లేదో ఎప్పుడైనా ఆలోచించారా?

ముఖ్యంగా టీనేజ‌ర్స్ నైట్ లేటుగా ప‌డుకొని ఉద‌యం లేటుగా లేస్తున్నారు. వారిపై ప‌రిశోధ‌న చేయ‌గా తేలిన విష‌యం ఏమిటంటే.. వారు ఏ టైమ్‌కి పడుకుంటారు. ఏ టైమ్‌కి లేస్తారు. ఏ టైమ్‌లో చురుగ్గా ఉంటారు. రోజులో ఏ టైమ్‌లో అలసటగా అనిపిస్తుంది, ఏ టైమ్‌లో చదువుకుంటే బాగా అర్ధమవుతుంది లాంటి ప్రశ్నలు వేసి సమాధానాలు రాబట్టారు. ఈ ప్రశ్నలతో పాటు వారు గురక పెడతారా? ఆస్త‌మా ఉందా, తుమ్ములు, జలుబు ఎక్కువగా ఉంటాయా అని కూడా అడిగారు. దీని ద్వారా లేట్‌గా ప‌డుకొని లేట్‌గా లేచే టీనేజ‌ర్ల‌లో ఆస్త‌మా, అలెర్జీలు వ‌చ్చే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంద‌ని తెలుసుకున్నారు. అస‌లు ప్ర‌తిరోజూ పోయే నిద్ర స‌రిపోతుందో లేదో తెలుసుకోవాలంటే ఒక‌టే మార్గం. ఈ రోజు నిద్ర‌పోతే త‌ర్వాత రోజు అస‌లు నిద్ర అనే ఆలోచ‌నే రాకూడ‌దు. కునుకు తీయాల‌ని కూడా అనుకోకూడ‌దు. అస‌లు ప‌గ‌లు నిద్ర అనే మాటే రాకుండా ఉన్న‌ట్లయితే నిద్ర స‌రిపోతున్న‌ట్లు తెలుసుకోవాలి. 


 


logo