గురువారం 28 జనవరి 2021
Health - Dec 03, 2020 , 17:57:07

సీతాఫ‌లం తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు

సీతాఫ‌లం తిన‌డం వ‌ల్ల క‌లిగే ఆశ్చ‌ర్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు

హైద‌రాబాద్ : సంవత్సర కాలంలో కేవలం మూడు నెలలు మాత్రమే దొరికే సీతాఫలం అంటే ఇష్టపడని వారు ఉండరు. శీతాకాలం వచ్చిందంటే కచ్చితంగా వీటిని తినాల్సిందే అని ఫీల్ అయ్యేవారు చాలా మంది ఉన్నారు.  అయితే నోరూరించే సీతాఫలం రుచికరమే కాదు.. ఆరోగ్యకరమని కూడా చెబుతున్నారు నిపుణులు. సీతాఫలం ఆకులు, బెరడు, వేర్లు ఇలా అన్ని భాగాలు రకరకాల వ్యాధుల నివారణకు ఉపయోగపడతాయట. సీతాఫలంలో సి విటమిన్‌, కాల్షియం, ఫాస్పరస్‌, పొటాషియం, మెగ్నీషియం సమృద్ధిగా లభిస్తాయి. మరి ఇవి తినడం వల్ల ఆరోగ్యానికి ఎలాంటి లాభాలున్నాయో తెలుసుకుందాం.

- సీతాఫలంలోని సల్ఫర్‌ చర్మవ్యాధుల్నీ తగ్గిస్తుంది. 

- బరువు తగ్గాలనుకునే వారికి సీతాఫలం బాగా ఉపయోగపడుతుంది.

- గర్భవుతిగా ఉన్న సమయంలో సీతాఫలం చాలా మంచిది. కానీ గింజలు మింగకుండా చూసుకోవాలి. 

- వీటి ఆకులు మధుమేహాన్ని తగ్గించడంతోపాటు బరువు కూడా తగ్గించే గుణం కలిగి ఉంటాయి. 

- గుండె జబ్బులు రాకుండా కాపాడుతుంది.

- గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతుంది, తద్వారా  అరుగుదలను పెంచుతుంది

- డయాబెటీస్ ఉన్నవారు రోజుకో సీతాఫలం తినచ్చు. అంతకంటే ఎక్కువ తినకూడదు.

- బ్లడ్ ప్రెషర్ ను కంట్రోల్ చేస్తుంది

- కొవ్వును తగ్గిస్తుంది

- అనీమియా ఉన్నవారికి సహాయపడుతుంది

- కడుపులో నొప్పి, మంటను తగ్గిస్తుంది

- రోగనిరోధకశక్తిని పెంచుతుంది

- క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది

- ఆస్తమా తగ్గిస్తుంది. 

- వీటి బెరడు మరిగించి తీసిన డికాక్షన్‌ డయేరియాని తగ్గిస్తుంది.

- ఆకుల కషాయం జలుబుని నివారిస్తుంది

- సీతాఫలంలోని ఫాస్పరస్‌, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు.. ఎముకల పరిపుష్టికి తోడ్పడతాయి.

- సీతాఫలం గింజల్ని పొడిచేసి తలకు రాసుకుంటే పేల సమస్య ఉండదు.


logo