చక్కెర ఆరోగ్యానికి మంచిదేనట !

హైదరాబాద్ :సహజంగా తియ్యగా ఉండే చక్కెర నిజానికి ఆరోగ్యానికి మంచిదేనట. చెరుకుగడతో తయారయే చక్కెరలో ఎలాంటి కెమికల్స్ కలవవు కాబట్టి ఇది స్వచ్ఛమైన చక్కెర అంటున్నారు ఆహార నిపుణులు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం.. మనం రోజూ చేసే భోజనంలో కచ్చితంగా ఆరు రకాల రుచులు ఉండాలట. వాటిలో అన్నిటికన్నాముఖ్యమైనది తీపి. చెక్కరలో మనకు తెలియని చాలా రకాల ఔషధ విలువలు ఉన్నాయట. చక్కెరను మిశ్రీ, శర్కర, కండ చక్కెర అని పిలుస్తారు. ఇది తినడం వల్ల శరీరానికి చాలా రకాల లాభాలున్నాయట. అవేంటంటే..
-కండ్లకు మంచిది
-నీరసం, అలసట తగ్గిస్తుంది
-విరేచనాలకు మందులా పనిచేస్తుందట.
-మగవారిలో సెమినల్ ద్రవాన్ని మెరుగుపరుస్తుంది
- బలాన్నిస్తుంది
-రక్తంలో యాసిడ్ లెవెల్స్ ను బ్యాలెల్స్ చేస్తుంది
-వాంతులు, విరేచనాలను తగ్గిస్తుంది.
-వట దోషాలను అదుపులో ఉంచుతుంది.
-చేదును తగ్గిస్తుంది
-సంతానోత్పత్తిని పెంచుతుంది
-పాలిచ్చే తల్లులకు చక్కెర మంచి చేస్తుంది
ఇన్నిరకాల ప్రయోజనాలున్న చక్కెర ఆరోగ్యానికి మంచిది కాదని ఎందుకంటారు. దీనికి కారణాలు ఉన్నాయట. అవేంటంటే.. ముడి చక్కెరను మంచి రంగు కోసం.. సల్ఫరిక్ యాసిడ్ తో ప్రాసెసింగ్ చేసి బ్లీచింగ్ చేస్తున్నారు. ఇలా చేయడం వల్ల చెక్కరలో విషపూరితమైన స్పటికాలు దాగిఉంటాయట. ఇలా తయారు చేయబడిన చెక్కర మాత్రమే ఆరోగ్యానికి హాని చేస్తుందట.
ఎటువంటి రసాయనాలు కలవని స్వచ్ఛమైన చెక్కర ఆరోగ్యానికి ఎలాంటి హాని చేయదు. ఇది లేత పసుపు లేదా బూడిద రంగులో ఉంటుంది. అంతేకాదు తటస్థ పిహెచ్-విలువలను కలిగి ఉంటుంది. సరైన మోతాదులో తీసుకుంటే కండ చక్కెర ఆరోగ్యానికి చాలా మంచిదని ఆహార నిపుణులు వెల్లడిస్తున్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.