మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - May 29, 2020 , 12:19:40

చక్కెర.. సిగరెట్‌తో సమానమట!

చక్కెర.. సిగరెట్‌తో సమానమట!

ధూమపానం, మద్యపానం ఆరోగ్యానికి హానికరం. అయినా వీటికి బానిసలు అవుతూనే ఉన్నారు. మొదట్లో సిగరెట్ల వల్ల ఆరోగ్యానికి హానికరం అని తెలియదు. ఒత్తిడి, ఆందోళనల నుంచి బయట పడేందుకు సిగరెట్‌ కాల్చేవారు. క్రమేనా దీనివల్ల గొంతు క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌, మూత్రాశయ క్యాన్సర్‌, ప్యాంక్రియాటిక్‌ క్యాన్సర్‌, గుండెపోటు సమస్యలు రావడంతో ఇది హానికరం అని తెలుసుకోవడానికి కొన్నేండ్లే పట్టిందని నిపుణులు చెబుతున్నారు.

ఒకసారి పొగతాగినవారు మళ్ళీ మళ్ళీ తాగేందుకు మొగ్గు చూపుతున్నారు. సిగరెట్‌ ఎంత ప్రమాదకరమో చక్కెర కూడా అంతే ప్రమాదకరం అని వైద్యులు చెబుతున్నారు. సాధారణంగా కోకో కోలా, చాక్లెట్‌, మిఠాయి, బిస్కెట్స్‌, కేక్‌, పుడ్డింగ్‌, జెల్లో తృణధాన్యాలు వంటి వాటిలో చక్కెర తప్పనిసరిగా ఉంటుంది. అలాగే తినే ఆహారం రొట్టె, పెరుగు, స్మూతీస్‌, కెచప్‌, కాల్చిన బీన్స్‌లో కూడా చక్కెర శాతం ఎక్కువగానే ఉంటుంది. ఇది చాలదు అన్నట్లు టీ, కాఫీ అంటూ చక్కెర ఎక్కువ వేసుకొని తాగేస్తున్నారు. ఇలా ప్రతీదాంట్లో వేసుకొని తాగడం వల్ల చక్కెరకు అడిక్ట్ అవుతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సిగరెట్‌లానే చక్కెరకు కూడా అడిక్ట్‌ అవుతామా? అనేదానికి ఒక అధ్యయనంలో అవుననే 


logo