బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Aug 22, 2020 , 21:20:20

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఇంటిచిట్కాలివే..

దగ్గు, జలుబు నుంచి ఉపశమనం పొందాలంటే ఇంటిచిట్కాలివే..

హైదరాబాద్‌: వర్షాకాలం, రాబోయే చలికాలం ప్రతిఒక్కరినీ వేధించే సమస్య దగ్గు, జలుబు. ప్రస్తుతం కొవిడ్‌ నేపథ్యంలో వీటిని తగ్గించుకునేందుకు తగిన జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాల్సిందే. అలా అని మెడికల్‌ షాప్‌కెళ్లి తరుచూ ట్యాబ్లెట్లు తెచ్చుకొని వాడడం సరికాదు. ఇంటిచిట్కాలతోనే వీటిని తగ్గించుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు.  

ఆవిరిపట్టాలి.. 

జలుబు, దగ్గు మొదలవగానే మొదట చేయాల్సిన ఆవిరి పట్టడం. కనీసం 10-15 నిమిషాలు ఆవిరి పట్టాలి. పసుపు నీటితోకానీ, నీళ్లల్లో జండూబామ్‌ లేదా ఇన్‌హేలింగ్‌ ట్యాబ్లెట్లు వేసుకొనిగానీ ఆవిరి పట్టుకోవచ్చు. దీంతో శ్వాసతీసుకోవడంలో ఇబ్బందులు తొలగిపోతాయి. 

తేనె తీసుకోవాలి..

జలుబు, దగ్గును నయం చేయడానికి తేనె ఉత్తమమైనది. దీనిలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. దాల్చినచెక్క పొడి లేదా నల్ల మిరియాల పొడితో కలిపి రోజుకు మూడు సార్లు తీసుకోవాలి.

వామును ఆహారంలో చేర్చాలి..

కోల్డ్‌ అండ్‌ కఫ్‌కు వాము (ఓమ) ఉత్తమ పరిష్కారం. దీనిని ఆహారంలో చేర్చుకోవాలి. నీటిలో వాము, తులసి ఆకులు వేసి మరిగించాలి. ఈ కషాయాన్ని రోజుకు రెండు లేదా మూడుసార్లు తీసుకోవాలి.

గోల్డెన్‌ మిల్క్‌..

గోల్డెన్ మిల్క్ అంటే పసుపు పాలు. అంటువ్యాధులతో పోరాడటానికి ఇది ఉత్తమమైన మార్గాలలో ఒకటి. జలుబు, దగ్గును ఇది త్వరగా తగ్గిస్తుంది. 

తులసి ఆకులు.. 

తులసి ఆకులు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇవి మన రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడతాయి. ఏళ్లుగా దీన్ని ఆయుర్వే నిపుణులు, మన ప్రాచీనులు సిఫారసు చేస్తున్నారు. అలాగే, ప్రతి ఇంటిలో తులసి చెట్టు ఉంటుంది. కాబట్టి సులువుగా దొరుకుతుంది.

వెల్లుల్లి..

వెల్లుల్లిలో యాంటీ బాక్టీరియల్,  యాంటీవైరల్ లక్షణాలు ఉన్నాయి. ఇవి వివిధ వ్యాధులతో పోరాడటానికి ప్రయోజనకరంగా ఉంటాయి.

నట్స్‌..

గింజలు మనల్ని వెచ్చగా ఉంచుతాయి. అందుకే వాటిని మనం ఆహారంలో చేర్చాలి. బాదం, వేరుశనగ, వాల్‌నట్, జీడిపప్పులాంటి నట్స్‌ను తీసుకోవాలి. 

తృణధాన్యాలు..

తృణధాన్యాలు ఆహారంలో చేర్చాలి. ఓట్స్‌ ఆరోగ్యకరమైనది మాత్రమే కాదు.. శరీరాన్ని వెచ్చగా ఉంచడానికి సహాయపడుతుంది. బ్రౌన్ రైస్, క్వినోవా, బజ్రా శరీరానికి వేడిని ఇస్తాయి.

కోడిగుడ్లు..

ఇందులో ప్రొటీన్స్‌, కేలరీలు మన శరీరానికి సరిపడా ఉంటాయి. ఇవి శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు తోడ్పడుతాయి. అందుకే సండే యా మండే రోజ్‌ కావో మండే అనే నినాదం అంత ప్రాచుర్యాన్ని పొందింది. 

సూప్స్‌..

వర్షాకాలంతోపాటు చలికాలం మనల్ని వెచ్చగా ఉంచే అత్యుత్తమ పదార్థం సూప్‌. ఇందులో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్లు, ఖనిజాలు కూడా సమృద్ధిగా ఉంటాయి. దీన్ని డైట్‌లో చేర్చాలి.


p>లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo