మంగళవారం 26 మే 2020
Health - May 23, 2020 , 14:50:10

కరోనాను జయించిన వారిలో కొత్త వ్యాధి! లక్షణాలివే..

కరోనాను జయించిన వారిలో కొత్త వ్యాధి! లక్షణాలివే..

ఇన్నిరోజులు ఎలాంటి వ్యాధులకు గురికాకుండా జాగ్రత్త పడిన వారు కూడా ఇప్పుడు కరోనా బారిన పడుతున్నారు. కరోనా నుంచి కష్టంగా బయటపడిన వారు ఇప్పుడు  మరో కొత్త వ్యాధికి గురవుతున్నారు. వీరిని మెడనొప్పి వేధిస్తున్నట్లు ఇటలీలోని ‘యూనివర్సిటీ హాస్పిటల్‌ ఆఫ్‌ పీసా’ వైద్యులు గుర్తించారు. ఇలా మెడనొప్పి రావడాన్ని ‘సబ్‌ అక్యూట్‌ థైరాయిడిటిస్‌’గా పిలుస్తారని వైద్యులు పేర్కొన్నారు. 

ఇటీవల ఓ యువతికి కరోనా పాజిటివ్‌ అని తేలింది. కొన్నిరోజులకే కరోనాను జయించి, ఇంటికి వెళ్లింది. అప్పటి నుంచి ఆమెను మరో సమస్య వెంటాడుతున్నది. మెడనొప్పితో పాటు థైరాయిడ్‌ గ్రంథి వద్ద నొప్పి మొదలైంది. దీనికి తోడు జ్వరం కూడా రావడంతో వైద్యుడిని సంప్రదించింది. పరీక్షలు చేసిన తర్వాత సబ్‌ అక్యూట్‌ థైరాయిడిటిస్‌ సమస్య అని వైద్యులు గుర్తించారు. వైరల్‌ ఇన్ఫెక్షన్ల బారినపడిన వారు కోలుకున్నప్పటికీ ఇన్‌ఫ్లమేటరీ రియాక్షన్‌ కారణంగా ఇలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాధి కారకమైన సార్స్‌ కోవ్‌ 2 కారణంగా ఆమెకు ఈ సమస్య వచ్చి ఉంటుందని వైద్యులు వెల్లడించారు.


logo