లండన్ : స్మోకింగ్ అలవాటుతో కొవిడ్-19 తీవ్రతతో పాటు మరణించే ముప్పు అధికమని ధొరాక్స్ జర్నల్‌లో ప్రచురితమైన తాజా అధ్యయనం స్పష్టం చేసింది. స్మోకింగ్‌కు కొవిడ్-19 తీవ్రతకు మధ్య సంబంధానికి విస్పష్ట ఆధారాలున్నాయని ఈ అధ్యయనం పేర్కొంది. స్మోకింగ్ ద్వారా తీవ్ర కొవిడ్ లక్షణాల బారినపడే ముప్పు ఉందని తమ పరిశోధన ఫలితాలు వెల్లడించాయని అధ్యయనానికి నేతృత్వం వహించిన యాష్లీ క్లిఫ్ట్ తెలిపారు.
పొగతాగడంతో గుండెజబ్బులు, క్యాన్సర్లు, ఇతర వ్యాధుల బారినపడే ముప్పు ఎలా ఉందో కొవిడ్-19 ఇన్ఫెక్షన్కూ ఇదే వర్తిస్తుందని అన్నారు. సిగరెట్లను వదిలేసి స్మోకింగ్‌ను విడిచిపెట్టడం శ్రేయస్కరమని బ్రిటన్‌లోని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు క్లిఫ్ట్ సూచించారు. పొగతాగని వారితో పోలిస్తే స్మోక్లర్లు కొవిడ్ బారినపడితే ఆస్పత్రిపాలవడం, మరణించే ముప్పు 80 శాతం అధికమని పరిశోధకులు వెల్లడించారు.