శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Health - Aug 05, 2020 , 19:33:13

శాఖాహారులకు శుభవార్త..!

శాఖాహారులకు శుభవార్త..!

హెల్సింకి: విటమిన్ బి 12 అనేది ఒక ముఖ్యమైన సూక్ష్మపోషకం. ఇది నాడీ వ్యవస్థ నిర్వహణకు తోడ్పడుతుంది. రక్త కణాల ఏర్పాటుకు సహాయపడుతుంది. ఇది ఎక్కువగా జంతువుల మాంసం నుంచి లభిస్తుంది. అయితే, శాఖాహారులు మాంసం తినరు. దీంతో వీరిలో ఈ విటమిన్‌ లోపం కనిపిస్తోంది. ఈ విటమిన్‌ కోసం వీరు మాత్రలను ఆశ్రయించాల్సి వస్తున్నది. ఇది వివిధ దుష్ప్రభావాలను దారితీస్తున్నది. ఇలాంటి వారికి ఫిన్లాండ్‌ శాస్త్రవేత్తలు ఓ శుభవార్తను అందించారు. కొన్ని రకాల ధాన్యం గింజలను కిణ్వన ప్రక్రియకు గురిచేస్తే విటమిన్ బి 12 పొందొచ్చని వారు తేల్చారు. 

ప్రొపియోనిబాక్టీరియం ఫ్రూడెన్‌రిచితో పులియబెట్టిన ధాన్యం-ఆధారిత పదార్థాలు  తగినంత విటమిన్ బి 12 కలిగి ఉన్నాయని ఫిన్లాండ్‌కు చెందిన సైంటిస్టుల బృంద కనుగొన్నది. 11 వేర్వేరు ధాన్యం-ఆధారిత పదార్థాలను ప్రొపియోనిబాక్టీరియం ఫ్రూడెన్‌రిచితో కిణ్వనం చేయగా, రెండు రకాల ధాన్యాల్లో విటమిన్ బి 12 ఎక్కువగా ఉత్పత్తి అవుతున్నట్లు గుర్తించారు. అవి, రైస్‌బ్రాన్‌(తౌడు), బుక్విట్‌ బ్రాన్‌ ధాన్యం(ఓ రకమైన గోధుమజాతికి చెందిన ధాన్యం)గా కనుగొన్నారు. భవిష్యత్తులో ఈ అధ్యయనం ద్వారా శాఖాహారులకు ఈ విటమిన్‌ సప్లిమెంట్స్‌ వాడకుండానే  విటమిన్ బి 12 అందించవచ్చని ధీమా వ్యక్తంచేశారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo