మాస్కో : కరోనా వైరస్ నుంచి వ్యాక్సిన్లు మెరుగైన రక్షణ ఇస్తున్నట్టు పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. బెలారస్ వ్యాక్సినేషన్ ప్రక్రియలో రష్యాకు చెందిన స్పుత్నిక్ వీ వ్యాక్సిన్ కొవిడ్-19 నుంచి రక్షణ కల్పించడంలో టీకా సామర్ధ్యం 97.2 శాతంగా ఉందని ఆర్డీఐఎఫ్ బుధవారం వెల్లడించింది.
ఆర్డీఐఎఫ్ పలు దేశాల్లో స్పుత్నిక్ వీ టీకాను సరఫరా చేస్తోంది. మరోవైపు సత్వర వ్యాక్సినేషన్‌తోనే కరోనా వైరస్ నుంచి ప్రపంచాన్ని కాపాడవచ్చని బూస్టర్ డోస్‌ల కంటే ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేపట్టడంపైనే ప్రభుత్వాలు దృష్టి సారించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) పేర్కొంది.