'పోషకాల'కు పుట్టిల్లు... 'పాలకూర'..!


Sat,December 12, 2015 01:51 PM

ఆరోగ్యంపై శ్రద్ధ ఉన్న ప్రతి ఒక్కరు నిత్యం వ్యాయామం చేయడంతోపాటు సరైన పోషకాలతో కూడిన ఆహారాన్ని తీసుకునేందుకు ప్రాధాన్యతను ఇస్తారు. ఈ క్రమంలోనే నిత్యం తీసుకునే ఆహారంలో పోషకాలు ఉండేలా జాగ్రత్త పడుతుంటారు. అయితే అలాంటి పోషకాలు దండిగా ఉన్న ఆహారాల్లో 'పాలకూర' కూడా ఒకటి. మరి దీన్ని తరచూ మన ఆహారంలో తీసుకోవడం వల్ల కలిగే లాభాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. పాలకూరలోని ఫ్లేవనాయిడ్స్ వయసుతోపాటు వచ్చే మతిమరుపును దూరం చేస్తాయి. 13 రకాల యాంటీ ఆక్సిడెంట్స్ పాలకూరలో ఉన్నాయి. ఇవి యాంటీ క్యాన్సర్ ఏజెంట్లుగా పనిచేస్తాయి.

2. విటమిన్ కె, విటమిన్ సి, ఎ, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్, కాల్షియం, సోడియం, క్లోరిన్, పాస్ఫరస్, ఐరన్, ప్రోటీన్లు, బీటాకెరోటిన్, బి కాంప్లెక్స్ విటమిన్లు తదితర పోషకాలు ఇందులో సమృద్ధిగా దొరుకుతాయి.

3. పలు రకాల క్యాన్సర్‌లు రాకుండా అడ్డుకుంటుంది. గుండె జబ్బులను నిరోధిస్తుంది. పాలకూరను ఆహారంలో ఎక్కువగా తినే మహిళలకు అండాశయ క్యాన్సర్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

4. నిత్యం మన శరీరానికి అవసరమైన ఐరన్ పాలకూర ద్వారా లభిస్తుంది. రక్తహీనతను తగ్గించడంతోపాటు రక్తాన్ని శుద్ధి చేసే గుణం, రోగ నిరోధక శక్తిని పెంచే గుణం పాలకూరలో ఉంది.

5. శరీర పెరుగుదలకు, దృఢత్వానికి పాలకూర ఉపయోగపడుతుంది.

100 గ్రాముల పాలకూరలో ఉండే పోషకాలు:
పిండి పదార్థాలు - 3.6 గ్రా.
చక్కెరలు - 0.4 గ్రా.
పీచు పదార్థాలు - 2.2 గ్రా.
కొవ్వు పదార్థాలు - 0.4 గ్రా.
మాంసకృత్తులు - 2.2 గ్రా.
విటమిన్ ఎ - 52 శాతం
ఫోలేట్ (విటమిన్ బి9) - 49 శాతం
విటమిన్ సి - 47 శాతం
విటమిన్ ఇ- 13 శాతం
విటమిన్ కె - 46 శాతం
కాల్షియం - 10 శాతం
ఐరన్ - 22 శాతం

6763

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles