కావలసిన వస్తువులు
సోయాబీన్స్: అరకప్పు,
ఉల్లిపాయ: ఒకటి,
టమాటా: ఒకటి,
కొత్తిమీర: కొద్దిగా,
నిమ్మరసం: రెండు టీస్పూన్లు, మిరియాల పొడి: పావు టీస్పూన్,
చాట్ మసాలా: పావు టీస్పూన్,
ఉప్పు: తగినంత
తయారీ విధానం
ముందుగా సోయాబీన్స్ని తగినన్ని నీళ్లు పోసి రెండు గంటలు నానబెట్టి కుక్కర్లో కొద్దిగా ఉప్పు వేసి ఉడికించాలి. ఒక గిన్నెలో ఉడికించిన సోయాబీన్స్, సన్నగా తరిగిన ఉల్లిపాయ, టమాటా, కొత్తిమీర, నిమ్మరసం, మిరియాల పొడి, చాట్ మసాలా, ఉప్పు వేసి బాగా కలిపి సర్వ్ చేస్తే సరి. ఆరోగ్యకరమైన సోయాబీన్స్ సలాడ్ రెడీ.