మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Health - Apr 04, 2020 , 18:17:35

ఇంగువ చేసే మేలు అంతాఇంతా కాదు!

ఇంగువ చేసే మేలు అంతాఇంతా కాదు!

హైద‌రాబాద్‌: ఇంగువ! ఘాటు వాస‌న‌తో ఉండే ఈ ఇంగువ‌లో లెక్క‌కు చిక్క‌న‌న్ని ఔష‌ధ గుణాలున్నాయి. మ‌న దేశీయ వంట‌కాల్లో ఈ ఇంగువ‌కు ప్ర‌త్యేక స్థానం ఉన్న‌ది. ప‌ప్పు, సాంబార్ లాంటి వంట‌కాల్లో ఇంగువ‌ను క‌లిపితే ఆ వంట‌ల‌కు అద్భుత‌మైన రుచి వ‌స్తుంది. కేవ‌లం రుచికే కాదు, ఆరోగ్యానికి కూడా ఇంగువ ఎంతో మేలు చేస్తుంది. అంతేకాదు రోజ్ వాట‌ర్ లాంటి ఇత‌ర మిశ్ర‌మాల‌తో క‌లిపి ముఖంపై మ‌ర్ధ‌న చేసుకుంటే అందాన్ని కూడా రెట్టింపు చేస్తుంది. రుచి, ఆరోగ్యం, అందం ఇన్ని ల‌క్ష‌ణాలున్న ఇంగువ గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకుందామా..

మ‌నిషిలోని ఉద‌ర సంబంధ స‌మ‌స్య‌ల‌న్నింటికి ఇంగువ మంచి ప‌రిష్కారం చూపుతుంది. దీనిలోని  యాంటీ సెప్టిక్‌ గుణాలు కడుపు ఉబ్బరం, అజీర్తిని తగ్గిస్తాయి. రోజూ కొద్దిగా  ఇంగువను పప్పు, సాంబార్ లాంటి వంట‌కాల్లో వేసుకుంటే జీర్ణవ్యవస్థ చక్కగా పనిచేస్తుంది. గ్లాసెడు నీళ్లలో చిటికెడు ఇంగువ పొడి కలిపి తాగినా మంచి ఫలితం క‌నిపిస్తుంది. ఇంగువ‌లోని యాంటీ వైరల్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ లక్షణాలు పొడి దగ్గు, ఆస్తమా, బ్రాంకైటిస్ లాంటి శ్వాససంబంధ‌మైన‌ ఇబ్బందుల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లిగిస్తాయి. 

ఇంగువలో అల్లం పొడి, తేనె కలిపి తాగినా మంచి ఫ‌లితం ల‌భిస్తుంది. రక్తం చిక్కదనాన్ని పెంచడం, రక్తపీడనాన్ని తగ్గించడంలోనూ ఇంగువ తోడ్పడుతుంది. ఇంగువ‌లోని కౌమరిన్‌ రక్త ప్రవాహాన్ని మెరుగుప‌ర్చ‌డమేగాక‌, రక్తం గడ్డకట్టడాన్ని కూడా నివారిస్తుంది. నెలసరి సమయంలో ఒక కప్పు మజ్జిగలో కొంచెం ఇంగువ, మెంతుల పొడి, చిటికెడు ఉప్పు కలిపి తాగితే పొత్తికడుపులో నొప్పి మాయ‌మ‌వుతుంది. వేడి నీళ్లలో ఇంగువ వేసుకొని రోజులో రెండుమూడు సార్లు తాగితే  తలనొప్పి తగ్గిపోతుంది. 

అల్లం, ఇంగువ మిశ్ర‌మాన్ని దోమ‌లు, చీమ‌లు కుట్టడంవల్ల ఏర్పడిన దద్దుర్ల మీద రాస్తే త‌క్ష‌ణ‌మే అవి త‌గ్గిపోతాయి. ఇంగువ‌లోని యాంటీ బ్యాక్టీరియల్‌ గుణాలు మొటిమలు, వాటివల్ల ఏర్పడే మచ్చలను పోగొట్టి ముఖాన్ని అందంగా మారుస్తాయి. ముల్తానీ మట్టి, రోజ్‌వాటర్‌, ఇంగువ మిశ్రమాన్ని ముఖంపై రాసుకుంటే మొటిమ‌లు పూర్తిగా త‌గ్గిపోతాయి. కేశాల ఆరోగ్యానికి కూడా ఇంగువ బాగా ప‌నిచేస్తుంది. యోగర్ట్‌, బాదం నూనె, ఇంగువ మిశ్ర‌మాన్ని తలకు రుద్దుకొని ఆరిన తర్వాత వేడి నీళ్లతో శుభ్రం చేసుకుంటే వెంట్రుక‌లు తాజాగా, సుతిమెత్త‌గా ఉంటాయి.

ప్ర‌తీ రోజు న‌మ‌స్తే తెలంగాణ తాజా వార్త‌లు క‌థ‌నాలు కోసం ఈ లింక్ ను క్లిక్ చేసి .. టెలిగ్రామ్ యాప్ ను స‌బ్ స్క్రైబ్ చేసుకోగ‌ల‌రు..


logo