ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Health - May 06, 2020 , 21:05:28

కరివేపాకుతో ఎన్ని లాభాలో..!

కరివేపాకుతో ఎన్ని లాభాలో..!

హైదరాబాద్‌: కరివేపాకే కదా అని తేలిగ్గా తీసి పారేస్తారు చాలా మంది. కానీ దాని ఉపయోగాలు తెలిస్తే మాత్రం ఎవరూ ఆ పని చేయరు. మరి కరివేపాకుతో ఎన్ని లాభాలో ఒకసారి చూద్దాం..

1. కిడ్నీలో రాళ్లు ఏర్పడిన వాళ్లు సాధారణంగా మూత్రనాళ ఇన్‌ఫెక్షన్‌కు గురువుతారు. అలాంటివాళ్లు కరివేపాకు తింటే సమస్య తగ్గుతుంది.

2. అజీర్తితో బాధపడే వారు కరివేపాకును నమిలి మింగడం వల్ల ప్రయోజనం కనిపిస్తుంది. 

3. షుగర్‌ వ్యాధితో బాధపడేవారు రోజూ కరివేపాకును ఏ రూపంలో తీసుకున్నా మేలు జరుగుతుంది. ఎందుకంటే కరివేపాకులో షుగర్‌ లెవల్స్‌ను కంట్రోల్‌ చేసే లక్షణం ఉంటుంది.

4. బ్యాడ్‌ కొలెస్టరాల్‌ను తగ్గించడంలో కూడా కరివేపాకు బాగా పనిచేస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారు రెగ్యులర్‌గా కరివేపాకు తీసుకోవాలి. 

5. కరివేపాకులో కుదుర్లకు ఆరోగ్యం చేకూర్చే లక్షణం కూడా ఉంటుంది. కాబట్టి రెగ్యులర్‌గా కరివేపాకు తీసుకునే వారి కుదుర్లు సుతిమెత్తగా తయారవుతాయి. logo