ఆదివారం 17 జనవరి 2021
Health - Nov 30, 2020 , 22:19:18

రోజూ అల్లం తింటే ఎన్ని లాభాలో..!

రోజూ అల్లం తింటే ఎన్ని లాభాలో..!

హైదరాబాద్‌ : అల్లం ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అల్లాన్ని మనం అప్పడప్పుడు కూరల్లో వేసుకోవడంతో పాటు.. ఛాయ్‌లోనూ వేసుకుని తాగుతుంటాం. అయితే.. అప్పుడప్పుడు మాత్రమే కాకుండా అల్లం ప్రతిరోజు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా రకాల లాభాలున్నాయట. జ్యూస్, వేడినీళ్లలో కూడా అల్లం వేసుకుని తాగడం వల్ల చాలా రకాల ఆరోగ్య సమస్యలు దూరమవుతాయట. అవేంటో తెలుసుకుందాం..  

1. ఇన్‌ఫెక్షన్స్‌ : అల్లంలో ఉండే యాంటీ-ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్, యాంటీ మెక్రోబయల్ ఎఫెక్ట్ శరీరంలోని చాలా అవయవాలకు మేలు చేస్తాయి. ఇవి వైరస్, బ్యాక్టీరియాలతో బాగా పోరాడుతాయి. ఫలితంగా ఎలాంటి ఇన్‌ఫెక్షన్స్‌ దరిచేరవు. గుండెల్లో నొప్పి, మంట లాంటి వాటి నుంచి కూడా త్వరగా ఉపశమనం లభిస్తుంది. 

2. నెలసరి నొప్పి : తాజా అధ్యయనంలో అల్లం స్త్రీలలో నెలసరి సమయంలో వచ్చే నొప్పిని తగ్గిస్తుందని తెలిసింది. నెలసరి రావడానికి ముందు నుంచే అల్లం నీటిని తాగిడం వల్ల ఇంకా మంచి ఫలితం కనిపిస్తుంది.

3. కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు : కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి అల్లం బాగా సహాయపడుతుంది. కండరాలకు దెబ్బ తగిలిన కారణంగా వచ్చే నొప్పిని కూడా తగ్గిస్తుంది. రోజు రెండ్రు గ్రాముల చొప్పున 11 రోజుల పాటు అల్లం తీసుకుంటే వీటన్నింటినీ నుంచి బయటపడొచ్చట.

4. షుగర్  : డైటీషియన్లు చెబుతున్న దాన్ని బట్టి అల్లం షుగర్ లెవెల్స్ ను స్థిరంగా ఉంచుతుందట. దీనిలో హెల్తీ ఫ్యాట్, గ్లూకోజ్ మెటబాలిజమ్ ఇన్సులిస్ లెవెల్‌ను కాపాడి.. షుగర్ హెచ్చు తగ్గులు కాకుండా చేస్తుంది.

5. దీర్ఘకాలిక సమస్యలకు చెక్ : గుండె జబ్బులు, క్యాన్సర్ (బ్రెస్ట్ -ఓవరియన్ క్యాన్సర్, కొలొన్ క్యాన్సర్), అల్జీమర్స్ లాంటి దీర్ఘకాలిక సమస్యలకు అల్లం చెక్ పెడుతుంది. 

6. తాజా శ్వాస : అల్లం నోటి దుర్వాసనతో పోరాడి.. తాజా సువాసనకు కారణమవుతుందట. అల్లం టీ తాగడం వల్ల అది  నోటిలోని  ప్యాలెట్‌ను శుభ్రపరిచి తాజా శ్వాసను మీ సొంతం చేస్తుంది. 

7. రోగనిరోధక శక్తి ని పెంచుతుంది : అల్లంలోని యాంటీఇన్ ఫ్లామెటరీ, యాంటీపైరెటిక్ ఎఫెక్ట్స్  రోగనిరోధక శక్తిని పెంచుతాయి. జలుబు, దగ్గు, ఫ్లూ లాంటి వాటి నుంచి కాపాడుతుంది.  

8. బరువు తగ్గిస్తుంది : బరువు తగ్గాలనుకునే వారికి అల్లం బాగా ఉపయెగపడుతుది. కడుపులోని పేగులను శుభ్రం చేయడంతో పాటు.. రక్తాన్ని నిర్విషీకరణ చేస్తుంది. అల్లం టీ అరుగుదలను పెంచుతుంది. శరీరంలో కొవ్వును తగ్గించి మెటబాలిజమ్ రేట్‌ను పెంచుతుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.