మంగళవారం 27 అక్టోబర్ 2020
Health - Sep 22, 2020 , 20:29:43

గుర‌క‌పెట్టే అల‌వాటుందా..! క‌రోనా ముప్పు ఎక్కువే

గుర‌క‌పెట్టే అల‌వాటుందా..! క‌రోనా ముప్పు ఎక్కువే

సాధార‌ణంగా గుర‌క పెట్టే అల‌వాటు ఉంటే వారికి కొన్ని ఆరోగ్య స‌మ‌స్య‌లు ఉన్న‌ట్లే. దీంతోపాటు బోన‌స్‌గా క‌రోనా వ‌చ్చింద‌టే దీని ముప్పు మ‌రింత పెరుగుతుంది. సాధార‌ణ మ‌నుషుల‌కు వ‌చ్చిన క‌రోనా క‌న్నా, గుర‌క‌పెట్టే వాళ్ల‌కు క‌రోనా వ‌స్తే వారి ప్రాణాల‌కు మూడురెట్లు అధిక ముప్పు ఉంటుంద‌ని ప‌రిశోధ‌కులు వెల్ల‌డించారు. దీనిమీద ఇప్ప‌టివ‌ర‌కు 18 అధ్య‌య‌నాలు చేశారు ప‌రిశోధ‌కులు. అంతేకాదు మ‌రో ముఖ్య‌మైన విష‌యాన్ని వెల్ల‌డించారు.

మ‌ధుమేహం, స్థూల‌కాయం, ర‌క్త‌పోటు వ్యాధులు ఉన్న‌వారికి క‌ర‌నో వ‌స్తే, అదో పెద్ద వ్యాధిలా భావించాల్సిన ప‌నిలేదు అంటున్నారు. ఈ మూడు ఇంకా డేంజ‌ర్ అంటున్నారు. ఈ మూడు ఉన్న‌వారికి గుర‌క త‌ప్ప‌కుండా వ‌స్తుంది. ఇప్పుడు క‌రోనా పాజిటివ్ వ‌చ్చిన‌వాళ్లు కోలుకుంటున్నారు. కానీ ముందున్న వ్యాధుల నుంచి మాత్రం కోలుకోలేక‌పోతున్నారు. గుర‌క‌పెట్టి నిద్ర‌పోయేవారి కండ‌రాలు విశ్రాంతి తీసుకునే స‌మ‌యంలో శ్వాసనాళంలోకి తాత్కాలికంగా కొన్ని క్షణాలపాటు గాలి సరిగా పోదని, ఫలితంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడే ప్రమాదం ఉందని అధ్య‌య‌నంలో తేలింది. 


logo