బుధవారం 23 సెప్టెంబర్ 2020
Health - Apr 21, 2020 , 19:26:16

త‌క్కువ తినాలంటే.. వాస‌న పీలిస్తే స‌రి!

త‌క్కువ తినాలంటే.. వాస‌న పీలిస్తే స‌రి!

బ‌రువు త‌గ్గాల‌నుకుంటారు. కంటి ముందు క‌నిపించేవ‌న్నీ క‌డుపులో దాచుకోవాల‌నిపిస్తుంది. ఇలా అవ్వా కావాలి బువ్వా కావాలి అంటే కుద‌ర‌దు క‌దా. ఇప్పుడు ఈ రెండూ కుదురుతాయి. ఎలా అంటే... మీకు ఇష్ట‌మైన‌వ్నీ కంటి ముందు పెట్టుకోండి. వాటి నుంచి వ‌చ్చే వాస‌న‌ను రెండు నిమిషాలు గ‌ట్టిగా పీల్చండి. అంతే దెబ్బ‌కు స‌గం ఆక‌లి మాయం. దీంతో మీరే త‌క్కువ తింటారు. ఈ మాట  ఎవ‌రో చెప్పింది కాదు.  ఓ అధ్య‌య‌నంలో తేలింది.

యూనివర్సిటీ ఆఫ్‌ సౌత్‌ ఫ్లోరిడా రీసెర్చర్లు ఓ అధ్యయనం నిర్వహించి, ఈ విషయాన్ని కనుగొనగా, 'మార్కెటింగ్‌ రిసెర్చ్‌' అనే జర్నల్‌ దీన్ని ప్రచురించింది. 2 నిమిషాలు వాసన చూస్తే ఎంతో సంతృప్తి కలుగుతుందని ఈ అధ్యయనం పేర్కొంది. ఆ తర్వాత ఆహారం ఏది అయినా, తక్కువగానే తీసుకుంటామని, క్యాలరీలు పెరుగుతాయన్న భయం ఉండదని చెప్పింది. ఆహారం వాసన వల్ల సంతృప్తి లభించడమే దీనికి కారణమని వివరించింది. ఈ అధ్యయన బృందంలో ఓ ఇండియన్ ప్రొఫెసర్ కూడా ఉండటం గమనార్హం. 


logo