శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - May 09, 2020 , 13:45:11

హెడ్‌ఫోన్స్ పెట్టుకొని నిద్ర‌పోతున్నారా?

హెడ్‌ఫోన్స్ పెట్టుకొని నిద్ర‌పోతున్నారా?

ఈ త‌రానికి పొద్దుపోకుంటే చాలు చేతిలో ఫోన్‌, చెవిలో ఇయ‌ర్‌ఫోన్స్‌. వీటిని ఇలానే కంటిన్యూ చేస్తూ రాత్రి నిద్ర‌కూడా పోతున్నారు.  హెడ్‌ఫోన్స్‌ పెట్టుకుని  నిద్ర‌పోవ‌డం వ‌ల్ల అనారోగ్యం స‌మ‌స్య‌లు కొని తెచ్చుకున్న‌ట్లే అని వైద్యులు చెబుతున్నారు. ఎందుకంటే మ‌నిషి నిద్రించేట‌ప్పుడు మెద‌డు పూర్తిస్థాయి విశ్రాంతి తీసుకుంటుంద‌ని, హెడ్ ఫోన్స్ ను అలాగే ఉంచుకుని నిద్రపోతే మెదడుపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, శరీరంలో బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని వైద్యులు చెబుతున్నారు. హెడ్ ఫోన్స్ పెట్టుకుని పాటలు, సంగీతం వింటూ వాటిని తీయకుండా నిద్రపోయే అలవాటు ఉంటే కనుక వెంటనే దానికి స్వస్తి చెప్పాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. 


logo