శుక్రవారం 15 జనవరి 2021
Health - Nov 27, 2020 , 18:33:23

రాత్రుళ్లు నిద్రపట్టడం లేదా..? ఇవి తెలుసుకోండి...!

 రాత్రుళ్లు నిద్రపట్టడం లేదా..? ఇవి తెలుసుకోండి...!

హైదరాబాద్: హాయిగా నిద్రపోవాలంటే అదృష్టం ఉండాలి అని పెద్దలు అంటుంటారు. ఎందుకంటే నిద్ర ఆరోగ్యానికి చాలా మంచిదయినప్పటికీ.. చాలా మంది నిద్రపోవడానికి టైం లేక దిగులు పడుతుంటారు. మరికొంత మంది సమయం ఉన్నా.. నిద్ర పట్టడం లేదని బాధపడుతున్నారు. రోజంతా పనిచేసి అలసిపోయినప్పటికీ రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడం అనేది ఎక్కువ మంది ఎదుర్కొంటున్నసమస్య. అయితే.. ఇలా అవటానికి మనసులో ఏవైనా ఆలోచనలు ఉండటమో.. కొత్త చోటు అవడమో అని మనం అనుకుంటుంటాం. కానీ రాత్రుళ్లు నిద్రపట్టకపోవడానికి ఇంకా కొన్ని కారణాలుంటాయట.  మరి అవేంటో.. వాటి నుంచి తప్పించుకోవడం ఎలాగో అవేంటో  చూద్దాం...  

- రాత్రుళ్లు నిద్ర పట్టకపోవడానికి ముఖ్య కారణం స్లీపింగ్ టైమింగ్స్ అని నిపుణులు చెబుతున్నారు. మనం రాత్రి పడుకోవడం, ఉదయాన్నే లేవడం రోజూ ఒకే సమసయంలో చేయాలి. మార్పులు చేయడం వల్ల నిద్రలేమి సమస్యలు తలెత్తుతాయి.

-రాత్రి పడుకునే ముందే కాదు, సాయంత్రం కూడా కాఫీ లేదా కఫెనైటెడ్ డ్రింక్స్ తాగకుండా ఉండాలి. కెఫైన్ మెండ్‌ను మరింత యాక్టివ్ చేసి.. నిద్రను దూరం కొడుతుంది.

-పడుకునే ముందు వేడి నీళ్లతో స్నానం చేసి పడుకుంటే హాయిగా నిద్రపడుతుంది.

-మనకు నిద్ర పట్టకపోవడానికి మన బెడ్ నీట్‌గా, కంఫర్ట్‌గా ఉండటం కూడా చాలా ముఖ్యం.  మంచం శుభ్రంగా లేకపోవడం వల్ల, దిండు మెత్తగా లేకపోవడం వల్ల కూడా నిద్ర పట్టకపోవచ్చు.

-నిద్రపోవడానికి మంచం ఎక్కామంటే ఫోన్ పక్కక్కు పెట్టేయాల్సిందే. మనకు నిద్ర పట్టకపోవడానికి మన ఫోన్ కూడా కారణమవుంది.

-పడుకునే ముందు కాసేపు మెడిటేషన్ చేస్తే ప్రశాతంగా నిద్రపోవచ్చు. 

-నిద్ర పట్టాలంటే పడుకునే ముందు ఏదైనా పుస్తకం చదవటం మేలు. ఇదే అలవాటుగా మార్చుకుంటే.. మీకు నిద్ర పట్టకపోవడం నుంచి తప్పించుకోవచ్చు.

- వ్యాయామం శరీరానికి మంచిదే.. కానీ రాత్రుళ్లు చేయకపోవడమే మంచిదని నిపుణులు చెబుతున్నారు. నైట్ ఎక్సర్‌సైజ్ చేయడం వల్ల నిద్ర పట్టదు.

-సెలవుల్లో, వారాంతరాల్లో ఖాళీగానే ఉన్నాం కదా అని రోజంతా నిద్రపోకూడదు. ఇలా చేయడం వల్ల రాత్రుళ్లు నిద్ర పట్టదు.

-మన మంచం మీద వర్క్ చేసుకోవడం, కూర్చుని కబుర్లు చెప్పుకోవడం లాంటి ఇతర పనులు చేయడం వల్ల .. రాత్రి పడుకున్నప్పుడు నిద్ర సరిగా పట్టదు.

 లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.