గురువారం 04 మార్చి 2021
Health - Jan 23, 2021 , 20:34:38

ఇలా పడుకుంటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు..

ఇలా పడుకుంటే నెలసరి నొప్పిని తగ్గించుకోవచ్చు..

హైద‌రాబాద్ : నెలలో అన్ని రోజుల కన్నా మహిళలకు ఆ రోజులు చాలా ముఖ్యమైనవి. శరీరంలో హార్మోన్ల హెచ్చుతగ్గుల కారణంగా చాలా మంది పీరియడ్స్ సమయాన్ని నరకప్రాయంగా గడుపుతుంటారు. వీటి నుంచి ఉపశమనం కలిగించేందుకు టీల నుండి మూలికల వరకు చాలానే ఉన్నాయి. అయితే నెలసరి సమయంలో మీకు కలిగే బాధ నుంచి ఉపశమనాలలో  ఖచ్చితంగా పాటించాల్సినది ఏంటంటే.. నిద్రా స్థానాలను మార్చడం.  

మనస్సుతో పాటు శరీరానికి విశ్రాంతి తీసుకోవడానికి నిద్ర ఒక్కటే గొప్ప మార్గం. అదేవిధంగా, పీరియడ్ బాధ నుండి ఉపశమనం కలిగించేందుకు కూడా నిద్ర కొన్ని అద్భుతాలు చేస్తుంది. నిద్రలేమి కారణంగా, నెలసరి రోజులు మరింత భయంకరంగా మారవచ్చు కూడా.  అలా కాకుండా ఉండేందుకు మీకు కొన్ని సౌకర్యవంతమైన, తేలికైన నిద్ర స్థానాలు సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. అవేంటంటే.. 

1. పిండం స్థితిలో నిద్ర

మీరు గర్భంలో పిండం చూశారా?  అన్నీ వంకరగా ఉంటాయి. అలా నిద్రపోతున్నప్పుడు, మీ ఉదర ప్రాంతం చుట్టూ కండరాలు సడలించబడతాయి. కాబట్టి పిండంలా పడుకున్నప్పుడు నెలసరి సమయంలో కలిగే నొప్పి, తిమ్మిరి వంటి వాటి నుంచి కాస్త ఉపశమనం లభిస్తుంది.  అంతేకాదు ఇలా నిద్రపోవడం వల్ల లీకేజీకి కూడా అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. 

2. మోకాళ్ల క్రింద దిండుతో నిద్రించడం

ఒక రౌండ్ దిండు తీసుకోండి (చాలా ఎక్కువ కాదు), వెళ్లకిలా పడుకుని ఆ దిండును మీ మోకాళ్ల క్రింద ఉంచండి. ఇలా పడుకున్నప్పుడు మీ కాళ్ళు సూటిగా ఉండేలా చూసుకోండి. అవి ఎత్తులో లేదా తక్కువగా ఉండకూడదు, లేకుంటే అది మీ మొత్తం రక్త ప్రవాహాన్ని ప్రభావితం చేస్తుంది. దిండు లేకపోతే టవల్ ను రోల్ చేసి మోకాళ్ల క్రింద ఉంచవచ్చు. ఇలా చేసిన కొన్ని నిమిషాల్లోనే  మీ కండరాలు సడలించాయని మీరు భావిస్తారు. చాలా తేలికగా ఫీల్ అవుతారు. హాయిగా నిద్రపోతారు కూడా. 

3. పిల్లల్లా నిద్రపోవడం

పిల్లల్లా పడుకోవడం అంటే యోగా భంగిమలో ఎవరు నిద్రిస్తారు అని మీరు ఆలోచిస్తున్నారేమే. కానీ ఇలా పడుకోవడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. చిన్నపిల్లల్లా మోళ్లపై బోర్లా పడుకున్నప్పుడు మీ కండరాలు ఎలాంటి ఉపశమనం పొందుతాయో మీరు నమ్మలేరు. ఓ సారి ట్రై చేశాక మానలేరు కూడా అంత హాయిగా ఉంటుంది. అంతేకాదు.. ఇలా పడుకోవడం వల్ల నెలసరి సమయంలో వచ్చే తలనొప్పి నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇది నిద్రను ప్రేరేపించడానికి సహాయపడుతుంది. ఎందుకో నీకు తెలుసా? ఎందుకంటే ఈ భంగిమ మీ శరీరానికి, మనసుకు కూడా విశ్రాంతినిస్తుంది. కాబట్టి. సుఖంగా ఉండటానికి, నిద్రను క్రమబద్ధీకరించడానికి మీరు చేయగలిగే మరికొన్ని విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు, మీ గది ఉష్ణోగ్రతను నియంత్రించడం, వేడి నీటిని తాగడం.  కప్పు అల్లం కలిపిన టీ తాగడం లాంటివి. ఇవన్నీ పీరియడ్ సమయంలో కలిగే ఇబ్బందుల నుంచి  ఉపశమనం ఇస్తాయి.

VIDEOS

logo