6 గంట‌ల క‌న్నా త‌క్కువ‌గా నిద్రిస్తే గుండె జ‌బ్బులు తప్ప‌వ‌ట‌..!

Thu,January 17, 2019 03:02 PM

నిత్యం మీరు ఎన్ని గంట‌ల పాటు నిద్ర‌పోతున్నారు ? 6 గంట‌లైనా నిద్రిస్తున్నారా, లేదా ? అంత‌కు త‌క్కువ అయితే మాత్రం మీరు ప్ర‌మాదంలో ఉన్న‌ట్లే. ఎందుకంటే... నిత్యం ఆరు గంట‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం పాటు నిద్ర‌పోయే వారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చేందుకు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ట‌. అలాగే వారిలో ర‌క్త నాళాల్లో కొవ్వు పేరుకుపోయే అవ‌కాశం 27 శాతం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు తాజాగా చేప‌ట్టిన ప‌రిశోధ‌న‌లో తేలింది. నిత్యం 7 లేదా 8 గంట‌ల పాటు నిద్ర‌పోయే వారితో పోలిస్తే 6 గంట‌ల క‌న్నా త‌క్కువ‌గా నిద్ర‌పోయే వారికి పైన చెప్పిన విధంగా అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు.


అమెరిక‌న్ కాలేజ్ ఆఫ్ కార్డియాల‌జీలో తాజాగా ప్ర‌చురిత‌మైన ఓ అధ్య‌య‌నం ప్ర‌కారం.. సైంటిస్టులు 3974 మంది ఉద్యోగుల అల‌వాట్లు, వారికున్న వ్యాధుల‌ను ప‌రిశీలించారు. వారిలో 2/3 వంతు వారు మ‌గ‌వారే. అలాంటి వారిలో చాలా మంది ఆల్క‌హాల్‌, కెఫీన్ ఎక్కువ‌గా ఉండే డ్రింక్స్ తాగుతారని, దీని వ‌ల్ల వారు నిద్ర‌లేమి స‌మ‌స్య‌తో బాధ‌ప‌డుతున్నార‌ని సైంటిస్టులు నిర్దారించారు. అలాంటి వారిలో గుండె జ‌బ్బులు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ట్లు గుర్తించారు. నిద్ర‌లేమి స‌మ‌స్య ఉన్న‌వారు రోజూ 6 గంట‌ల క‌న్నా త‌క్కువ స‌మ‌యం పాటు నిద్రిస్తున్నార‌ని, వారిలో చాలా మందికి కొలెస్ట్రాల్‌, గుండె జ‌బ్బులు త‌దిత‌ర స‌మ‌స్య‌లున్నాయ‌ని సైంటిస్టులు చెబుతున్నారు. క‌నుక ప్ర‌తి ఒక్క‌రు నిత్యం 6 నుంచి 8 గంట‌ల పాటు నిద్రిస్తే మంచిద‌ని, లేదంటే పైన చెప్పిన స‌మ‌స్య‌ల‌తోపాటు ఒబెసిటీ, డ‌యాబెటిస్ వ‌చ్చేందుకు కూడా అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంద‌ని సైంటిస్టులు హెచ్చ‌రిస్తున్నారు.

4717
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles