సోమవారం 25 మే 2020
Health - Apr 04, 2020 , 10:37:35

10 గంట‌లు నిద్ర‌పోవాలి.. లేకుంటే అనారోగ్యం

10 గంట‌లు నిద్ర‌పోవాలి.. లేకుంటే అనారోగ్యం

వేస‌వి వ‌చ్చిందంటే చాలు. ప‌గులు ఎక్కువ‌. రాత్రి త‌క్కువ స‌మ‌యం ఉంటుంది. సాధార‌ణంగా రోజుకి ఎలాంటి ప‌రిస్థితుల్లో అయినా 8 గంట‌లు నిద్ర‌పోయాలి. వేస‌విలో అయితే ఖ‌చ్ఛితంగా 10 గంట‌లు నిద్ర‌పోవాలంటున్నారు నిపుణులు. ఎందుకో మీరే తెలుసుకోండి. రోజుకి 10 గంట‌ల‌పాటు హాయిగా నిద్ర‌పోవాలి. దీంతో రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. హార్మోన్లు స‌మ‌తుల్యం అవుతాయి. నిద్ర‌కు త‌గిన‌ట్లుగా నీరు కూడా తాగుతూ ఉండాలి. రోజుకి 8 నుంచి 10 గ్లాసుల నీరు త‌ప్ప‌నిస‌రిగా తాగాలి. రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంపొందించుకోవ‌డానికి నీరు దివౌష‌ధంగా ప‌నిచేస్తుంది. పోష‌క విలువులున్న ఆహారం ఎక్కువ‌గా తీసుకోవాలి.

అధిక మిన‌ర‌ల్స్ ల‌భించే చేప‌లు. కొవ్వు త‌క్కువుగా ఉండే పాల ఉత్ప‌త్తులు, గింజ‌లు, విట‌మిన్ ఎ ఎక్కువ‌గా ఉండే గుడ్లు, లివ‌ర్‌, బిటాకెరోటిన్ ఉండే పాల‌కూర‌, ఆలూ, క్యారెట్ వంటివి తీసుకోవ‌డంతో రోగ‌నిరోధ‌క శ‌క్తిని పెంచుకోవ‌చ్చ‌ని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. వేస‌వి క్యారెంటైన్‌లో ఆరోగ్యాన్ని కాపాడుకోవ‌డం ఏంతో ముఖ్యం.

 


logo