చ‌లికాలంలో చ‌ర్మ సంర‌క్ష‌ణ ఇలా..!


Sat,November 17, 2018 07:00 PM

చ‌లికాలం వచ్చిందంటే చాలు చర్మం తెల్లగా పొడిబారిపోతుంది. ఇది ఎంతో అసహనానికి గురిచేస్తుంది. అందుకే ఈ కాలంలో చర్మాన్ని ర‌క్షించుకోవటం చాలా కష్టత‌ర‌మ‌వుతుంది. ఎంత జాగ్రత్తగా ఉన్నా స‌రే ఏదో ఒక చోట ప‌గులు వ‌స్తుంది. తెల్ల‌గా అవుతుంది. అయితే చ‌లికాలంలో చ‌ర్మ స‌మ‌స్య‌ల నుంచి బ‌య‌ట ప‌డాలంటే అందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. అవేమిటంటే...

1. నువ్వుల నూనె చలికాలంలో చక్కగా పనిచేస్తుంది. శరీరానికి నూనె పట్టించి సున్ని పిండితో గోరువెచ్చని నీటితో స్నానం చేస్తే చర్మం మృదువుగా తయారవుతుంది. లేదా వేజలిన్‌ బాడీలోషన్‌ లేదా ఏ ఇతర బాడీ లోషన్‌ అయినా రాసుకొని స్నానం చేస్తే శరీరం మృదువుగా ఉంటుంది.
అంతేకాదు, స్నానం చేసే నీటిలో కొద్దిగ కొబ్బరి నూనె లేదా ఆలివ్‌ ఆయిల్‌ చుక్కలు వేసి వేడినీటితో స్నానం చేస్తే ఇది శరీరం మొత్తానికి మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది . స్నానం చేసిన తర్వాత తప్పనిసరిగా ముఖానికి క్రీమ్‌ రాసుకోవాలి . ముఖ్యంగా విటమిన్‌ ఇ ఉన్న క్రీములు వాడడం మంచిది.

2. చలికాలంలో వచ్చే పగుళ్ళకు వేజలిన్‌ వాడటం ఉత్తమం. సాధారణ సబ్బుకు బదులు గ్లిజరిన్‌ సబ్బులు వాడటం మంచిది. రాత్రి పడుకునే ముందు తప్పనిసరిగా చేతులకు, కాళ్ళకు మాయిశ్చరైజర్‌ క్రీమ్‌ రాసుకోవాలి.

3. వారానికి ఒకసారైనా వేడి చేసిన కొబ్బరినూనె లేదా నువ్వుల నూనెతో మసాజ్‌ చేసుకోవడం మంచిది. పాదాలు పగల కుండా సాక్స్ వేసుకోవడం ఉత్తమం.

4. చలికాలం పొడవునా వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి మంచినీళ్లు పదే పదే తాగాలనిపించదు. పైగా గాలిలో తేమ తక్కువ కాబట్టి శరీరం నుంచి బయటకు వెళ్లే నీటి శాతం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. దీంతో చర్మం మరింతగా పొడిబారి పోవడమూ తప్పదు. చలికాలంలో మహిళలు ఎన్ని జాగ్రత్తలు పాటించినా, ఎన్ని క్రీములు రాసుకున్నా... తగిన మోతాదులో నీరు తాగకపోతే మాత్రం చర్మానికి ప్రమాదమేనని నిపుణులు సూచిస్తున్నారు.

3398

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles