ఇలా చేస్తే చుండ్రు శాశ్వతంగా మాయం..!

Tue,January 15, 2019 12:17 PM

తలలో చుండ్రు అధికంగా ఉండడం వల్ల దురద, ముఖం మీద మొటిమలు వస్తుంటాయి. వీటిని పోగొట్టడానికి ఏవేవో నూనెలు, షాంపూలు వాడుతుంటారు. ఈ కింది చిట్కాలతో చుండ్రు సమస్య నుంచి బయట పడండి.


-గోరువెచ్చని నీటిలో కొన్ని వేపాకులను రాత్రంతా నానబెట్టాలి. ఉదయాన్నే వేపాకులను తీసేసి ఆ నీటిని తలకు రాసుకోవాలి. 30 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి మూడుసార్లు ఇలా చేస్తే చుండ్రు సమస్య తగ్గుతుంది.

-యాపిల్ సిడర్ వెనిగర్‌లో కొంచెం నీరు చేర్చి బాగా కలుపాలి. షాంపూకి బదులుగా ఈ మిశ్రమాన్ని తలకు వాడాలి. దీనిలో ఉండే యాంటీ వైరల్, యాంటీ ఫంగల్ గుణాలు తలలోని క్రిములను తొలిగిస్తుంది. తరచూ ఇలా చేస్తే చుండ్రు తొలిగి దురద తగ్గుతుంది.

-గోరింటాకు పొడిలో చక్కెర, ఆలివ్ నూనె, నిమ్మరసం, కలిపి పేస్ట్‌లా చేయాలి. ఈ మిశ్రమాన్ని తలకు పూతలా పట్టించాలి. 45 నిమిషాల తరువాత తలస్నానం చేయాలి. వారానికి రెండుసార్లు ఇలా చేస్తే తలంతా శుభ్రంగా ఉంటుంది.

-వేడి నీటిలో గులాబీ ఆకులను బాగా మరిగించాలి. చల్లారాక ఆ నీటిని తలకు రాసుకోవాలి. గంట తరువాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇలా తరచూ చేస్తే చుండ్రు బాధ తగ్గుతుంది.

-జుట్టుకు పోషణ అవసరం. మజ్జిగ, నిమ్మరసం, కొబ్బరి నీరు వంటి పానీయాలను రోజుకు రెండుసాైర్లెనా తీసుకోవాలి.

7754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles