శుక్రవారం 23 అక్టోబర్ 2020
Health - Oct 01, 2020 , 19:21:40

గ్యాస్, కడుపునొప్పి తగ్గడానికి సింపుల్ చిట్కా...

  గ్యాస్, కడుపునొప్పి తగ్గడానికి సింపుల్ చిట్కా...

హైదరాబాద్ : గ్యాస్ ,కడుపునొప్పి తగ్గడానికి చాలామంది పలురకాల విధానాలను అనుసరిస్తారు. సహజంగా లభించే వాటితో సులభంగా అజీర్తి, కడుపు నొప్పి, గ్యాస్ట్రిక్ వంటి సమస్యల నుంచి బయట పడొచ్చు. అందుకోసం ఇలాచేస్తే సరి. 

 - దానిమ్మ గింజల చూర్ణం 50గ్రాములు

 -ఎండిన పుదీనా ఆకుల పొడి 50గ్రాములు

  -వాము 100 గ్రాములు

 -నల్ల ఉప్పు 50 గ్రాములు

ఇవన్నీటినీ కలిపి పొడి చేసుకొని ఓ గాజు సీసాలో భద్రపరుచుకోవాలి. 

వాడే విధానం: రోజూ భోజనం చేసిన తర్వాత ఒక  చెంచా తిని  గోరువెచ్చని నీళ్లు తాగుతుంటే, అజీర్ణ సమస్య, కడుపు నొప్పి, గ్యాస్ వంటివి ఇట్టే తగ్గిపోతాయి.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి


logo