శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Jul 22, 2020 , 21:16:24

ఈ ల‌క్ష‌ణాల‌తో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని తెలుసుకోవ‌చ్చు!

ఈ ల‌క్ష‌ణాల‌తో రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉంద‌ని తెలుసుకోవ‌చ్చు!

క‌రోనా బారిన ప‌డ‌కుండా ఉండాలంటే ఇమ్యునిటీ ప‌వ‌ర్‌ను పెంచుకోవ‌డమే వైద్యం అని ఆరోగ్య నిపుణులు ఎప్పుటి నుంచో చెబుతున్నారు. దానికోసం ప్ర‌తి ఒక్క‌రూ మంచి ఆహారం తీసుకుంటున్నారు. మ‌రి ఆ ఆహారం ఎంత మాత్రం ప‌నిచేస్తుందో తెలుసుకోవాల‌ని ఎప్పుడైనా అనిపించిందా?  రోగ‌నిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉండే వారిలో ఈ ల‌క్ష‌ణాలు క‌నిపిస్తాయ‌ట‌. మ‌రి అవేంటో తెలుసుకుందాం. 

ల‌క్ష‌ణాలు :

* శ‌రీరంలో ఎక్క‌డైనా దెబ్బ త‌గిలితే చాలామందికి త్వ‌ర‌గా మాన‌దు. దానికి కార‌ణం వారిలో ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉండ‌డ‌మే. హెల్దీగా ఉన్న వారిలో న్యూట్రియెంట్స్‌తో నిండి బ్ల‌డ్‌ని పంపి గాయాన్ని మానేలా చేస్తుంది. ఇమ్యునిటీ సిస్టం వీక్‌గా ఉంటే దెబ్బ త‌గ్గ‌డానికి చాలా టైం తీసుకుంటుంది.  

* రోగ‌నిరోధ‌క శ‌క్తిలో సుమారు 70 శాతం పొట్ట‌కి సంబంధించిన స‌మ‌స్య‌లే వ‌స్తాయి. పొట్ట ఉబ్బ‌రం, కాన్స్టిపేష‌న్‌, డ‌యేరియా వంటి స‌మ‌స్య‌లు ఎక్కువ‌గా వ‌స్తే ఇమ్యునిటీ ప‌వ‌ర్ త‌క్కువ‌గా ఉన్న‌ట్లు నిర్థారించుకోవ‌చ్చు.

* ఇమ్యునిటీ వ‌ప‌ర్ స‌రిగా లేక‌పోతే శ‌రీరంలో ఓపిక త‌గ్గిపోయి నీర‌సంగా త‌యార‌వుతుంటారు. ఎందుకంటే శ‌రీరంలో ఉన్న ఎన‌ర్జీని కాస్త ఇమ్యునిటీ సిస్టంకి పంపిస్తూ ఉంటుంది. 

* అన్నిటిక‌న్నాముఖ్యంగా జ‌లుబు, ద‌గ్గు, చెవి నొప్పి, ఊపిరి తీసుకోవ‌డంలో స‌మ‌స్య‌లు వ‌చ్చేవారికి ఇమ్యునిటీ ప‌వ‌ర్ చాలా త‌క్కువ‌గా ఉంటుంది. ఇలాంటి వారు ఎక్కువ‌గా ఇన్‌ఫెక్ష‌న్ బారిన ప‌డుతూ ఉంటారు. 

* ఈ ల‌క్ష‌ణాల‌తో ఇమ్యునిటీ ప‌వ‌ర్ ఉందో లేదో చెక్ చేసుకోవ‌చ్చు. ఇలాంటి వారికి క‌రోనా సోకే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.  

రోగ నిరోధక శక్తే.. దివ్యౌషధం

విటమిన్స్‌తో రోగనిరోధక శక్తి

పోషకాహారం.. కరోనా దూరం

 logo