సోమవారం 21 సెప్టెంబర్ 2020
Health - Apr 20, 2020 , 15:20:45

అతిగా నిద్ర‌ పోతున్నారా?...

అతిగా నిద్ర‌ పోతున్నారా?...

అతిగా తింటే బ‌రువు పెర‌గ‌డంతోపాటు, అనారోగ్యానికి గుర‌వుతారు. అలాగే అతిగా మ‌ద్యం సేవించ‌డం, పొగ‌తాగ‌డం వ‌ల్ల ఆరోగ్యానికి హానిక‌రం అనే విషయం అందరికీ తెలిసిందే. కానీ.. అదేపనిగా నిద్రపోతుంటే ఎలాంటి అనారోగ్యంపాలౌతారో తెలుసా?. నిద్ర స‌రిపోక‌పోతే లేని రోగాలు ఎలా అయితే కొని తెచ్చుకుంటామో.. రోజుకు 9 గంట‌ల‌కు మించి నిద్ర‌పోయినా మ‌ర‌ణానికి ద‌గ్గ‌ర‌వుతున్న‌ట్టేనంటున్నారు శాస్త్రవేత్తలు. 9 గంట‌ల‌కు మించితే గంట గంట‌కు జీవిత‌కాలం త‌గ్గిన‌ట్లేనని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. 

2,30,000 మంది ఆరోగ్య పరిస్థితిని క్షుణ్ణంగా పరిశీలించిన సిడ్నీ యూనివర్శిటీ శాస్త్రవేత్తలు ఈ నిర్ధారణకు వచ్చారు. అతిగా మద్యపానం, ధూమపానం చేసిన వారి కంటే అతిగా నిద్రపోయేవారు చనిపోవడానికి రెండు రెట్లు ఎక్కువ అవకాశం ఉందని శాస్త్రవేత్తలు తెలిపారు.  ఆరోగ్యకరమైన అలవాట్లు కలిగిన వారు సరాసరి ఆరు గంటలు పడుకుంటే క్షేమదాయకమని... మద్యం సేవించే వారు ఏడు గంటలు పడుకోవడం మంచిదని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు.


logo