శనివారం 19 సెప్టెంబర్ 2020
Health - Sep 14, 2020 , 17:16:31

మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు రైస్‌వాట‌ర్‌ తాగొచ్చా! తాగితే ఏమ‌వుతుంది?

మ‌ధుమేహ వ్యాధిగ్ర‌స్తులు రైస్‌వాట‌ర్‌ తాగొచ్చా!  తాగితే ఏమ‌వుతుంది?

సాధార‌ణంగా బియ్యం క‌డిగిన నీటిని ప‌డేస్తుంటాం. వాటితో జుట్టు పెరుగుదల మెరుగుప‌డుతుంద‌ని అంద‌రికీ తెలుసు. కానీ ఆరోగ్యానికి చాలామంచిది అన్న సంగ‌తి చాలా త‌క్కువ‌మందికే తెలుసుంటుంది. ముఖ్యంగా షుగ‌ర్ పేషంట్ల‌కు సాయ‌ప‌డుతుంది. అలాగే బ‌రువు త‌గ్గ‌డానికి కూడా తోడ్ప‌డుతుంది. మ‌రి రైస్‌వాట‌ర్‌తో సులువుగా బ‌రువు త‌గ్గే చిట్కాలేంటో చూద్దాం.

* ఈ రోజుల్లో అన్నం ఎక్కువ తినేవారు, త‌క్కువ తినేవారు అంద‌రూ అధిక బ‌రువుకు గుర‌వుతున్నారు. వారిలో శ‌క్తి లేక‌పోయినా బ‌రువు మాత్రం బీభ‌త్సంగా పెరిగిపోతున్నారు. దీనికి కార‌ణం వారు కూర్చొనే ప‌నిచేయ‌డం. తిన్న ఆహారం స‌రిగా జీర్ణంకాక శ‌రీరంలోని కొన్ని భాగాల్లో పేరుకుపోతుంది. దీంతో బ‌రువు పెర‌గ‌డానికి కూడా బాడీ స‌హ‌క‌రిస్తుంది.

* బ‌రువు త‌గ్గేందుకు చాలామంది వ్యాయామ‌లు, డ్యాన్స్‌లు ఇలా ఎన్నో ప‌నులు  చేస్తుంటారు. వీటితోపాటు రైస్ వాట‌ర్ తీసుకోవ‌డం వ‌ల్ల సులువుగా బ‌రువు త‌గ్గుతారు.  

* శ‌రీర శ‌క్తి స్థాయిల‌ను పెంచ‌డానికి బియ్యం నీరు అద్భుతంగా ప‌నిచేస్తుంది. అందుకే రోజువారి ఆహారంలో రైస్‌వాట‌ర్‌ను కూడా భాగం చేసుకోవాలి. 

* చైకైన పానీయాల‌లో రైస్ వాట‌ర్ ఒక‌టి. శ‌రీరం తొంద‌ర‌గా డీహైడ్రేట్ అవ్వ‌కుండా ఉండేందుకు రైస్‌వాట‌ర్ భేష్‌గా ప‌నిచేస్తుంది. అంతేకాదు ప‌ని చేసేట‌ప్పుడు, చెమ‌ట ప‌ట్టిన‌ప్పుడు శ‌రీర శ‌క్తి స్థాయిల‌ను పెంచుతుంది.

* బ‌రువు త‌గ్గ‌డానికి రైస్ వాట‌ర్ ప్ర‌ధాన పాత్ర పోషిస్తాయి. జీర్ణ‌క్రియ స‌రిగా ప‌నిచేయ‌క‌పోయినా బ‌రువు త‌గ్గ‌డానికి రైస్‌వాట‌ర్ ఉప‌యోగ‌ప‌డుతుంది. రైస్‌వాట‌ర్ జీర్ణ‌క్రియ‌ను మెరుగుప‌రుస్తుంది. విరేచ‌నాల‌ను అరిక‌డుతుంది.

* డ‌యాబెటిస్ ఉన్న‌వాళ్లంతా అధిక బ‌రువు ఉండ‌రు. కానీ వారిలో ఎక్కువ‌మంది అధిక బ‌రువు క‌లిగి ఉండ‌వ‌చ్చు. కానీ 10 శాతం బ‌రువు త‌గ్గ‌డం వ‌ల్ల ర‌క్తంలోని చ‌క్కెర స్థాయిలు బాగా త‌గ్గుతాయి. కాబ‌ట్టి మ‌ధుమేహ వ్యాధిగ్గ‌ర‌స్తుల‌కు రైస్‌వాట‌ర్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకోవాలి. 


logo