ఆదివారం 07 జూన్ 2020
Health - Apr 02, 2020 , 22:15:19

యాపిల్‌తో మెదడుకు పదును

యాపిల్‌తో మెదడుకు పదును

రోజుకో యాపిల్‌తో డాక్టర్‌కు దూరంగా ఉండొచ్చంటారు. అంతేకాదు మతిమరుపుకూ దూరంగా ఉండొచ్చంటున్నారు పరిశోధకులు. ముఖ్యంగా వృద్ధాప్యం వల్ల కనిపించే అల్జీమర్స్‌కి యాపిల్‌ మంచి మందుగా పనిచేస్తుందంటున్నారు. యాపిల్‌ పండులో ఉండే యాంటి ఆక్సిడెంట్లు జ్ఞాపక శక్తి పెరగడానికి దోహదపడుతాయంటున్నారు మసాచుసెట్స్‌ యూనివర్సిటీకి చెందిన డాక్టర్‌ థామస్‌ షియా. సాధారణంగా వయసు పెరుగుతున్న కొద్దీ మెదడు సామర్థ్యం తగ్గుతూ వస్తుంది. నాడుల మధ్య సమాచారం ప్రసారం కావడానికి మెదడులో కొన్ని రసాయనాలు తయారవుతాయి.

 మెదడు పనితీరు సక్రమంగా ఉండాలన్నా, జ్ఞాపకశక్తి బావుండాలన్నీ ఈ రసాయనాలు చాలా కీలకమైనవి. వీటి మోతాదులో తేడాలు ఏర్పడితే మెదడు పనితీరులో సమస్యలు వస్తాయి. ముఖ్యంగా అసిటైల్‌ కోలిన్‌ అనే రసాయనం అధికంగా ఉత్పత్తి కావడం వల్ల జ్ఞాపకశక్తి తగ్గుతుందని పరిశోధనలు చెబుతున్నాయి. యాంటి ఆక్సిడెంట్లు ఉన్న ఆహారంతో ఈ సమస్యను నివారించవచ్చంటున్నారు డాక్టర్‌ థామస్‌. అందుకే యాపిల్‌ పండుతో పాటు యాంటి ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండే పండ్లు, కూరగాయలను ఎక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారాయన. 


logo