మనం పడుకొనే పరుపును జాగ్రత్తగా ఎంచుకోవాలట..


Sun,November 4, 2018 09:55 PM

మన జీవితకాలంలో 16 సంవత్సరాలు నిద్రకే కేటాయిస్తామట. అందుకే మనం పడుకొనే పరుపును జాగ్రత్తగా ఎంచుకోవాలంటున్నారు నిపుణులు.
* పరుపు మరీ గట్టిగా ఉండడం మంచిది కాదంటున్నారు పరిశోధకులు. మరీ మెత్తగా లేదా మరీ గట్టిగా ఉన్నదాని కంటే కూడా మధ్యస్థంగా ఉన్న రకాన్ని ఎంపిక చేసుకుంటే వెన్ను నొప్పి బెడద ఉండదు.
* మార్కెట్‌లో చాలారకాల మ్యాట్రెస్‌లు అందుబాటులో ఉన్నాయి. కాబట్టి ఆన్‌లైన్‌లో వాటి గురించి రివ్యూలు, ఇతర విషయాలు తెలుసుకొని ఆ తర్వాత వాటిని కొనుగోలు చేయండి.
* వ్యక్తి ఎత్తుకంటే కనీసం పది సెంటీమీటర్ల పొడవు ఎక్కువ ఉన్న దాన్ని ఎంపిక చేసుకోవాలి. ఆరు లేదా అంతకంటే ఎక్కువ ఎత్తు ఉన్నవారు కింగ్ సైజ్ మాట్రెస్‌ను ఎంపిక చేసుకోవాలి.
* ఎంపిక చేసుకోవాలనుకుంటున్న పరుపు మీ వెన్ను భాగానికి సరైన ఆధారాన్ని అందిస్తున్నదో లేదో గమనించుకోవాలంటే ముందుగా దానిపై వెల్లకిలా పడుకోవాలి. అప్పుడు నడుం వెనుకగా మీ అరచేతిని పోనివ్వండి. మీ చేయి సులభంగా వెళ్తుందంటే మరీ మెత్తగా ఉన్నట్లు. అలా లేదంటే మరీ గట్టిగా ఉన్నట్లు అర్థం. నడుం నొప్పితో ఉన్నవారికి ఈ రెండు తరహాలూ పనికిరావు.
* ప్రతీ పది సంవత్సరాలకొకసారి పరుపును మార్చేయాలి. పలుచగా తయారై, ఉండలు కట్టిన పరుపు మీద పడుకోవడం చాలా ఇబ్బందిగా ఉంటుంది.

6717

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles