వాషింగ్టన్ : ప్రపంచవ్యాప్తంగా సత్వరమే ఐవర్ మెక్టిన్ ఔషధం వాడితే కరోనా మహమ్మారిని తరిమివేయడం సాధ్యమవుతుందని శాస్త్రవేత్తదలు తాజా అధ్యయనంలో వెల్లడించారు. ఈ ఔషధాన్ని తరచూ వాడితే కరోనా వైరస్ వ్యాప్తి గణనీయంగా తగ్గుతుందని పరిశోధకులు పేర్కొన్నారు. కొవిడ్-19 చికిత్సలో ఐవర్ మెక్టిన్ దివ్యౌషధంగా పనిచేస్తున్నదని ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా పలువురు వైద్యులు, ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. పలు పరిశోథనా పత్రాలు, అథ్యయన పత్రాలు, మెడికల్ రికార్డులను పరిశీలించిన అనంతరం ముగ్గురు అమెరికన్ సీనియర్ సైంటిస్టులతో కూడిన వైద్య నిపుణులు అమెరికన్ జర్నల్ ఆఫ్ థెరాప్యుటిక్స్ లో ఈ అధ్యయన వివరాలు వెల్లడించారు.
కొవిడ్-19 చికిత్సలో ఐవర్ మెక్టిన్ సమర్ధవంతంగా పనిచేస్తున్నదని ఫ్రంట్ లైన్ కొవిడ్-19 క్రిటికల్ కేర్ అలయన్స్ (ఎఫ్ఎల్సీసీసీ) పేర్కొంది. ఐవర్ మెక్టిన్ కరోనా మహమ్మారిని సమర్ధంగా నిర్మూలిస్తుందని తమ అధ్యయనంలో వెల్లడైందని ఎఫ్ఎల్సీసీసీ ముఖ్య వైద్యాధికారి, ప్రెసిడెంట్ పీర్ కోరీ పేర్కొన్నారు. తాము పరిశీలించిన ఆధారాల ప్రకారం కొవిడ్-19కు భద్రమైన, సమర్ధవంతమైన చికిత్సగా ఐవర్ మెక్టిన్ ఔషధం పనిచేస్తుందని మరోసారి వెల్లడైందని ఎఫ్ఎల్సీసీసీ వ్యవస్ధాపక సభ్యుడు పౌల్ మెరిక్ వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో కొవిడ్-19 చికిత్సలో ఐవర్ మెక్టిన్ వాడుతుండగా వైద్యుల పర్యవేక్షణలో ఈ డ్రగ్ వాడవచ్చని భారత్, దక్షిణాఫ్రికా, జింబాబ్వే, స్లొవేకియా, జెక్ రిపబ్లిక్, మెక్సికో సహా పలు దేశాలు అనుమతి ఇచ్చాయి.