గురువారం 02 ఏప్రిల్ 2020
Health - Mar 18, 2020 , 10:30:59

పక్షపాత నిర్ణయాల్ని కనిపెడతారు..!

పక్షపాత నిర్ణయాల్ని కనిపెడతారు..!

బెర్లిన్‌: ఒక విషయంలో మనిషి పక్షపాత నిర్ణయం తీసుకున్నాడో లేదో కనిపెట్టడం ఇకపై సులువు కానున్నది. మెదడు నుంచి విడుదలయ్యే ఒక రకమైన తరంగాల తీవ్రతను బట్టి ఈ విషయాన్ని గుర్తించవచ్చని జర్మనీలోని బియెలేఫెల్డ్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు తెలిపారు. ఈ వివరాలు ‘జేన్యూరోసై’ అనే జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. మనిషి ఏదైనా విషయంలో నిర్ణయం తీసుకునేప్పుడు మెదడులో ఆల్ఫా తరంగాలు విడుదలవుతాయని పరిశోధకులు తెలిపారు. పక్షపాతపూరితంగా లేదా ముందస్తుగా నిర్ణయం తీసుకున్న వాళ్లలో ఆల్ఫా తరంగాలు తీవ్ర గాఢతతో విడుదలవుతాయని, అలాకాని వాళ్లలో వాటి తీవ్రత తగ్గుతుందని వెల్లడించారు.  

మిల్లీ సెకండ్ల వ్యవధిలో ఓ దృశ్యాన్ని చూపించి, దాదాపు అదే సమయంలో మరో శబ్దాన్ని వినిపించి, వీటిలో దేన్ని ముందుగా అనుభూతి చెందారని పరిశోధకులు కొందర్ని అడిగారు. ప్రయోగానికి ముందే ఒక నిర్ణయానికి(దృశ్యాన్ని చూశాం లేదా శబ్దాన్ని విన్నాం) వచ్చిన కొందరు వ్యక్తుల మెదడులో ఆల్ఫా తరంగాలు తీవ్ర గాఢతతో విడుదలయినట్టు, అలా కాని వాళ్లలో తక్కువగా విడుదలైనట్టు అధ్యయనకారులు గుర్తించారు. 


logo
>>>>>>